దీపం ఎర | Prepared to provide new gas connections in Guntur | Sakshi
Sakshi News home page

దీపం ఎర

Published Thu, Dec 5 2013 3:13 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Prepared to provide new gas connections in Guntur

సాక్షి, గుంటూరు :ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టింది. నిన్నటి వరకు రచ్చబండ కార్యక్రమం వేదికగా  పించన్‌లు, రేషన్ కార్డులు ఇస్తామని ద రఖాస్తులు ఆహ్వానించిన అధికార పార్టీ నేడు గ్రామాల్లో డ్వాక్రా మహిళల ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలకు దిగింది. ఎత్తుగడల్లో భాగంగా ‘దీపం’ పథకం కింద కొత్త గ్యాస్ కనెక్షన్‌ల మంజూరుకు సిద్ధమైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎస్. సురేశ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గుంటూరు నగర పాలక సంస్థ, మున్సిపాల్టీలు, మండలాల నుంచి అర్హుల జాబితాలు తెప్పించారు. కొత్తగా రెండు వేల  కనెక్షన్‌లు ఇవ్వాలని నిర్ణయించారు.జిల్లాలో ఇప్పటికే 1,82,757 దీపం కనెక్షన్‌లు ఉన్నాయి. మాచర్ల పట్టణంలో 946, బాపట్లలో 99, బెల్లంకొండలో 105, తెనాలి పట్టణంలో 850 కొత్త కనెక్షన్‌లు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆయా స్థానిక సంస్థల కమిషనర్లు, తహశీల్దార్‌ల నుంచి అందిన లబ్ధిదారుల జాబితాలను అనుమతి కోసం ప్రభుత్వానికి పంపారు. ఇవి కాకుండా గుంటూరు నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో సుమారు 200 కొత్త కనెక్షన్లు దీపం కింద మంజూరు చేయాలని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబుకు ప్రతిపాదనలు వెళ్లినట్టు  తెలిసింది. 
 
 పెండింగ్ కనెక్షన్లకు దిక్కులేదు.. పేదవారికి అంది ంచే దీపం కనెక్షన్లపై స్థానిక సంస్థలు అంతగా శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారుల  జాబితాలకు గ్యాస్ ఏజెన్సీల వద్ద వున్న  జాబితాతో సరిపోలకపోవడం సమస్యగా మారింది. ఎంపిక చేసిన లబ్ధిదారులకు అంతకు ముందే కనెక్ష న్లు ఉన్నట్లు గా్యాస్ ఏజెన్సీల వద్ద వున్న జాబితాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఎవరు అర్హులో, అనర్హులనే ది ఇబ్బందిగా మారింది. ఉదాహరణకు. 2011-12 ఏడాదికి  19,583 గ్యాస్ కనెక్షన్‌లు మంజూరు కాగా, 17,026 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 16,293 మందికి పంపిణీ చేశారు. ఇంకా 3,290 దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇదిలావుంటే, గుంటూరు నగరంలో సుమారు 700 మందికి సాంకేతిక కారణాలు చూపి కొన్ని గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్ల పంపిణీ నిలిపివేశాయి. ఈ విషయాన్ని ఆహార సలహా సంఘ సమావేశం జరిగిన ప్రతిసారి సభ్యులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తెస్తూనే ఉన్నారు. గ్రామాల్లో నేతల హడావుడి.. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీల నేతలు గ్రామాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు, ఇప్పటి నుంచే నానా ప్రయాస పడుతున్నారు. ప్రధానంగా పేద మహిళా ఓటర్లకు ఎర వేసేందుకు దీపం పథకం గ్యాస్ కనెక్షన్లు ఇప్పిస్తామని నమ్మ బలుకుతున్నారు. ప్రతీరోజూ ఎవరో ఒక నాయకుడు పది మంది మహిళలను వెంటబెట్టుకుని ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి వెళుతున్నారు. ఆయాచోట్ల ఉన్నతాధికారులను కలిసి దరఖాస్తులు అందజేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement