
సాక్షి, విజయవాడ: యూజీసీ ఆదేశాలతో రాష్ట్రంలోని 20 యూనివర్సిటీల పరిధిలో పీజీ, యూజీ పరీక్షలు సెప్టెంబర్‌లోపు నిర్వహించనున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌తో పాటు రెగ్యూలర్ ఎడ్యుకేషన్ రెండు అవసరమేనని గవర్నర్ సూచించినట్టు చెప్పారు. కోవిడ్ కారణంగా అకడమిక్ కరిక్యులమ్ రీ డిజైన్ చేస్తున్నామని చెప్పారు.
ఈ ఏడాది నుంచి డిగ్రీ మూడేళ్లలో 10 నెలల పాటు ఇంటర్న్ షిప్‌ను తప్పనిసరి చేస్తున్నామని వెల్లడించారు. సెప్టెంబర్ 13 నుంచి 27 మధ్యలో ఎంసెట్ పరీక్షతో పాటు ఇతర పరీక్షలు కూడా నిర్వహిస్తామన్నారు. డిగ్రీ, పీజీ పరీక్షలకు కోవిడ్ కారణంగా హాజరు కానీ వారికి తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్లేస్‌మెంట్స్ వచ్చిన వారికి, అబ్రాడ్ వెళ్లిన వారికి ముందస్తుగా డిగ్రీ, పీజీ పరీక్షలు ప్రత్యేకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment