
'రాజధాని'పై భగ్గుమన్న రాయలసీమ
కర్నూలు/అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు చేసిన రాజధాని ప్రకటనపై రాయలసీమ భగ్గుమంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయనున్నట్టు అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన చేయడంతో రాయలసీమలో ఆందోళనలు మిన్నంటాయి. కర్నూలులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. కర్నూలు రాజధాని చేయాలంటూ న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు.
మెడికల్ కాలేజీ సమీపంలో హోర్డింగ్ మీదకు ఎక్కి విద్యార్థులు ఆందోళనకు దిగారు. అనంతపురం ఎస్కేయూలోనూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అనంతపురం-చెన్నై రాహదారిని దిగ్బంధించారు. క్లాక్ టవర్ వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మను బీసీ సంఘాలు నేతలు దహనం చేశారు. మరోవైపు రాయలసీమ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది.