పొంగిన చంద్రవంక వాగు | Raised and stream the chandra vanka vagu | Sakshi
Sakshi News home page

పొంగిన చంద్రవంక వాగు

Published Fri, Jun 19 2015 9:37 AM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM

Raised and stream the chandra vanka vagu

చింతూరు (తూర్పుగోదావరి జిల్లా): తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలో కురిసిన భారీ వర్షాలకు చంద్రవంక వాగు పొంగింది. శుక్రవారం కురిసిన భారీ వర్షం కారణంగా వాగు పొంగడంతో జగదల్‌పూర్ జాతీయ రహదారిపై చింతూరు, భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రెండు వైపులా వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా, వాగులోని నీటి వేగాన్ని గుర్తించకుండా వెళ్లిన ఒక బోరు లారీ ప్రవాహానికి కొట్టుకొని బోల్తాపడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అంతేకాకుండా మండలంలోని మరో వాగు అత్తకోడళ్లవాగు కూడా పొంగి పొర్లుతోంది. దీంతో చింతూరు, వీ.ఆర్.పురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisement

పోల్

Advertisement