టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ లో చేస్తున్న దీక్ష తెలంగాణ కోసమా, సమైక్యాంధ్ర కోస మా అని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్ ప్రశ్నించారు.
చంద్రబాబు కు ఈటెల సూటి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ లో చేస్తున్న దీక్ష తెలంగాణ కోసమా, సమైక్యాంధ్ర కోస మా అని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఢిల్లీలో దీక్ష పేరిట చంద్రబాబు డ్రామాలు నడిపిస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ ప్రకటన వెలువడిన వెంట నే సీమాంధ్ర రాజధాని కోసం రూ. 5 లక్షల కోట్ల ప్యాకేజీ అడిగిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు మాటమార్చాడని ప్రశ్నించారు. రెండు ప్రాంతాలు సమానమని అంటూ తెలంగాణ వ్యతిరేకిగానే ఆయన పనిచేస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ వ్యతిరేక దీక్షలో తెలంగాణ టీడీపీ నేతలు ఎలా కూర్చుంటున్నారని ప్రశ్నిం చారు. సమావేశంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు జి.జగదీశ్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, కె.రాజయ్య యాదవ్, సామేలు పాల్గొన్నారు.