
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి, తర్వాత టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వెంటనే చర్యలు తీసుకునేలా లోక్‌సభ, అసెంబ్లీ సెక్రటరీలను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు.
ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ ధర్మాసనం విచారణ జరపనుంది.