
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వద్ద భద్రతాపరమైన విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎన్.ఎం.డి ఫరూఖ్ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ హోదాలో ఉన్న తన కాన్వాయ్‌ను ఆపడంపై మండిపడ్డారు. కాపు కార్పొరేషన్ ద్వారా ముఖ్యమంత్రి కార్లు పంపిణీ చేస్తున్న సమయంలో మండలి చైర్మన్ కాన్వాయ్ రావడంతో పోలీసులు ఆపారు. వేరే మార్గం గుండా అసెంబ్లీ లోపలికి వెళ్ళాలని చెప్పారు. పోలీసులు తీరుతో ఆగ్రహానికి గురైన ఫరూఖ్ చీఫ్ మార్షల్స్‌ను వివరణ కోరారు.