తుని రూరల్(తూర్పుగోదావరి జిల్లా), న్యూస్‌లైన్ : తుప్పల్లో పడి ఉన్న గోనె సంచిలో ఓ మహిళ మృతదేహం లభ్యం కావడం సంచలనం కలిగించింది. తుని మండలం ఎస్.అన్నవరం శివారు కోమటి చెరువు సమీపంలో రహదారి పక్కన తుప్పల్లో హత్యకు గురైన గుర్తుతెలియని మహిళ(35) మృతదే హాన్ని ఆదివారం గుర్తించారు. తుని సీఐ ఎన్‌వీ భాస్కరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం ఉదయం తుని నుంచి ఎన్.చామవరం వెళుతున్న వ్యక్తికి కోమటి చెరువు సమీపంలో రోడ్డు పక్కన ప్లాస్టిక్ గోనె సంచి, అందులోంచి బయటకు ఉన్న మనిషి కాలు కనిపించడంతో రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
తుని రూరల్ ఎస్‌ఐ జి.రమేష్‌బాబు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. గోనె సంచిలో చూడగా మహిళ మృతదేహం ఉంది. నోరు, ముక్కు, చేతుల మీదుగా ఛాతికి, రెండు కాళ్లకు ప్లాస్టర్ చుట్టి ఉంది. ఊపిరాడకుండా ఉండేందుకు నోరు, ముక్కులకు ప్లాస్టర్ వేసి, ఆమెను హతమార్చినట్టు తెలుస్తోంది. ఈ హత్యలో ఒకరికంటే ఎక్కువమంది పాల్గొని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని మడత పెట్టి హంతకులు తాళ్లతో గట్టిగా కట్టివేశారు. మృతదేహాన్ని పౌల్ట్రీ ఫీడ్‌కు చెందిన అట్టపెట్టెలో ఉంచి, తర్వాత పౌల్ట్రీ ఫీడ్‌కే చెందిన ప్లాస్టిక్ గోనె సంచిలో మూటగా కట్టారు.
దీన్ని రోడ్డు పక్కన తుప్పల్లో విసిరేశారు. మృతదే హం చెడిపోకపోవడంతో శనివారం అర్ధరాత్రి సమయంలో ఆమెను హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. మహిళ శరీరంపై ఆభరణాలు, నుదుట కుంకుమ లేవు. పౌల్ట్రీ ఫీడ్‌కు చెందిన అట్టపెట్టెలు, ప్లాస్టిక్ గోనెసంచిలను వినియోగించడంతో ఆమె పౌల్ట్రీ ఫారంలో పని చేసే మహిళగా అనుమానిస్తున్నారు. తూర్పు గోదావరి లేదా విశాఖ జిల్లాలకు చెంది ఉండవచ్చని భావిస్తున్నారు.
పోలీసు స్టేషన్లకు సమాచారం
గుర్తు తెలియని మహిళకు సంబంధించిన వివరాలను తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లోని అన్ని పోలీసు స్టేషన్లకు పంపించారు. ఆయా పోలీసు స్టేషన్లలో నమోదైన అదృశ్యం కేసుల ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగేందుకు వీలవుతుందంటున్నారు. కాకినాడ నుంచి వచ్చిన క్లూస్ టీం, డాగ్ స్క్యాడ్‌లు సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించాయి. పోలీసులు సమీప గ్రామాలకు చెందిన కొంతమందిని రప్పించి.. వివరాలు సేకరించారు. మృతదేహంపై లేత గులాబీ రంగుపై ముదురు గులాబీ పువ్వులు ఉన్న చీర , ఎర్ర జాకెట్ ఉన్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
పునరావాస కేంద్రాలు ఎత్తివేత
Published Mon, Oct 14 2013 2:32 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
Advertisement
Advertisement