ఆదర్శ పాఠశాలలతో అసమానతలు తొలగాలి
సాక్షి, హైదరాబాద్: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఆదర్శ పాఠశాలలను మాటల్లోగాక చేతల్లోనూ తీర్చిదిద్దాలని ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశా రు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారమిక్కడ ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల సదస్సు జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ నేపథ్యంలో విద్యావ్యవస్థలో పెరిగిన అసమానతలను తగ్గించేలా ఆదర్శ పాఠశాలల నిర్వహణ ఉండాలని సూచించా రు. విద్యార్థి సమగ్ర అభివృద్ధిపై ఉపాధ్యాయులు దృష్టిపెట్టాలన్నారు.
ఆదర్శ పాఠశాలల రాష్ట్ర సంచాలకులు సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఆదర్శ పాఠశాలల్లో టీజీటీ ఉపాధ్యాయుల నియామకాలను వెంటనే చేపడతామని, వారు అందుబాటులో లేనిచోట తాత్కాలిక ఉపాధ్యాయులను నియమిస్తామని చెప్పారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నర్సిరెడ్డి, ప్రధానకార్యదర్శి ఐ.వెంకటేశ్వరరావు, కోశాధికారి మాణిక్యరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మారెడ్డి, రాములు, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. ఆదర్శ పాఠశాలల టీచర్లకు వెంటనే సర్వీసు రూల్స్ రూపొంది ంచాలని, సెలవుల వర్తింపుపై ఉత్తర్వులివ్వాలని, వేతనాలు ప్రతి నెలా మొదటితేదీనే టీచర్ల అకౌంట్లలో జమచేయాలని సదస్సులో తీర్మానించారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్స్‌కు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని, పాఠశాల నిర్వహణ గ్రాంటును విడుదల చేయాలనీ తీర్మానించారు.