వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విడుదలతో సమైక్యాంధ్ర ఉద్యమానికి కొండంత బలం వచ్చిందని ఆ పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి మిధున్రెడ్డి వెల్లడించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విడుదలతో సమైక్యాంధ్ర ఉద్యమానికి కొండంత బలం వచ్చిందని ఆ పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి మిధున్రెడ్డి వెల్లడించారు. తమ నేత రాకతో సమైక్యవాదుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. సమైక్య రాష్ట్రం కోసం తొలి సంతకం చేయడానికి జగన్ ముందుకు వచ్చారని ఆయన గుర్తు చేశారు.
సమైక్యాంధ్రపై నిజంగా చిత్తశుద్ది ఉంటే వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని మిధున్ రెడ్డి సీఎం కిరణ్ను డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు జగన్నామస్మరణ తప్ప మరో ధ్యాస లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం టీడీపీలు అడుతోన్న నాటకాలు త్వరలో బట్టబయలవుతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి వెల్లడించారు.