విద్యార్థి ఆత్మహత్య | Siddhartha Engineering College Student suicide in Narayanavanam | Sakshi
Sakshi News home page

విద్యార్థి ఆత్మహత్య

Published Mon, Nov 18 2013 3:12 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

Siddhartha Engineering College Student suicide in Narayanavanam

నారాయణవనం(చిత్తూరు), న్యూస్‌లైన్ :మండలంలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన డిప్లొమా విద్యార్థి బి.క్రాంతి కుమార్(17) సమీపంలోని వ్యవసాయ బావిలో ఆదివారం సాయత్రం శవమై తేలాడు. మృతుడు శ్రీకాకుళం జిల్లా సోంపేట వాసిగా గుర్తించారు. ఎస్‌ఐ ప్రసాదరావు కథనం మేరకు..నారాయణవనం మండలంలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల అనుబంధ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమో రెండో ఏడాది క్రాంతి కుమార్ చదువుతున్నాడు. స్థానికంగా హాస్టల్‌లోనే ఉంటున్నాడు.
 
 ఇతను కళాశాలకు సమీపం ఎరికంబట్టు పంచాయతీ పరిధిలోని వ్యవసాయ బావిలో ఆదివారం సాయంత్రం శవమై తేలాడు. రైతులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడు సిద్ధార్థ కళాశాల విద్యార్థిగా గుర్తించారు. కళాశాల ప్రిన్సిపాళ్లు చంద్రశేఖర్‌రెడ్డి, కుమార్‌బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా క్రాంతికుమార్ జూలై 15న కళాశాల నుంచి ఇంటికి వెళ్లిపోయాడన్నారు.
 
  ఈ నెల 14వ తేదీన కళాశాలకు వచ్చి హాస్టల్‌లో ఉంటున్నాడని తెలిపారు. క్రాంతికుమార్ గురించి అతని తల్లి కరుణాదేవి శనివారం వాకబు చేసిందన్నారు. ఈ క్రమంలో ఇతను తరగతులకు హాజరుకావడం లేదని, మూడు రోజులుగా హాస్టల్‌లోనూ లేడని తెలిసిందన్నారు. కాంత్రికుమార్ తనతో గొడవ పడ్డాడని, కొన్ని రోజులుగా మాట్లాడడం లేదని, మీరే చూసుకోవాలని అతని తల్లి కరుణాదేవి తమకు ఎస్‌ఎంఎస్ పంపిందని వివరించారు. ఈ క్రమంలో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసిందన్నారు. క్రాంతికుమార్ మృతి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశామని ఎస్‌ఐ ప్రసాదరావు తెలిపారు. ఇతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని, కుటుంబ సభ్యులను, సహచర విద్యార్థులను విచారిస్తే విషయం తెలుస్తుందని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement