వేములవాడ, న్యూస్‌లైన్ : రాష్ర్ట విభజన ప్రక్రియలో అవుతున్న జాప్యం తెలంగాణ వాసులను కలవర పెడుతోందని, సీమాంధ్రు ల కృత్రిమ ఉద్యమ నేపథ్యంలో పార్లమెంట్‌లో వెంటనే బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ (టీటీఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వేములవాడలో ఆదివారం శాంతి సద్భావన ర్యాలీ నిర్వహించారు. వీరికి టీజేఏసీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. అమరవీరుల స్తూపం నుంచి ప్రా రంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా వరకు సాగింది. ఈ సందర్భంగా టీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె. కిషన్‌రావు మాట్లాడుతూ సీమాంధ్రులది ముమ్మాటికి కృత్రిమ ఉద్యమమేనన్నారు. తెలంగాణ త్యాగాల ముందు అది దిగదుడుపే అని పేర్కొన్నారు.
ఒత్తిళ్లకులొంగి కేంద్ర ప్రభుత్వం మాట తప్పితే సహించేది లేదన్నారు. తెలంగాణలో ఉద్యమ నేపథ్యంలో ఏనాడు కూడా ప్రత్యేకవాదులు దాడులకు పాల్పడలేదని గుర్తుచేశారు. ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ముల వలే కలిసుందామని ఇందుకు సీమాంధ్రులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టీజేఏసీ నియోజకవర్గ చైర్మన్ తిరుమల్‌గౌడ్, కన్వీనర్ బొజ్జ కనుకయ్య, టీటీఎఫ్ నాయకులు కె.రాజేందర్, చంద్రశేఖర్, ఇప్పపూల దేవయ్య, ఎల్.దేవ య్య, పి. వెంకటేశ్వర్లు, బి,కృష్ణ, పి.రాజేందర్, ఆర్.శ్రీనివాస్, పి.శ్రీనివాస్, తిరుపతి, అంజయ్య పాల్గొన్నారు.
సీమాంధ్రులది కృత్రిమ ఉద్యమం..
Published Mon, Sep 2 2013 5:38 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement