రెండేళ్లలో పరిష్కారం : కలమట
ఓ నదీ తీర గ్రామంలో ఇన్ని సమస్యలా.. గ్రామంలో పర్యటించిన తరువాత, అక్కడి ప్రజలతో మాట్లాడాక వారు ఎలా బతుకుతున్నారా? అని అశ్చర్యం వేసింది. వందలాది ఎకరాల పంట పొలాల్లో ఇసుక మేటలు వేసినా ఎవరో వచ్చి ఏదో చేస్తారన్న ఆశతోనే రైతులు జీవిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారంలో 2006 నుంచి ప్రభుత్వాలు, జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నేను దీన్ని రెండేళ్లలో పరిష్కరిస్తాను. ముఖ్యంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళతాను. గతంలో ప్రతిపక్ష నేత గాఉన్నప్పుడు చంద్రబాబు ఈప్రాంతంలో పర్యటించారు. వీరి సమస్యలు ఆయనకు తెలుసు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకు వివరించి నిధులు మంజూరుకు కృషి చేస్తాను. గ్రామం నుంచి గర్బిణులను, రోగులను అత్యంత కష్టం మీద మంచానికి కట్టి వైద్యం కోసం తీసుకు వెళతారు. ఈ కష్టాలను సీఎంకు వివరించి గ్రామాభివృద్ధికి చర్యలు తీసుకుంటాను. ప్రతి ఏడాది వంశధారకు వరదలు వస్తే ఈ గ్రామం జలదిగ్బంధంలో ఉంటుంది. అలాంటప్పుడు జిల్లా కలెక్టర్లు గ్రామాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడి వెళుతున్నా తగిన చర్యలు తీసుకోక పోవడం బాధాకరం. ఇప్పటి కలెక్టర్‌కు సమస్య వివరించి తగిన చర్యలు తీసుకుంటాను.