పిల్లలకు ప్రేమతో భోజనాలు తినిపిస్తున్న తల్లులు
మహారాణిపేట (విశాఖ దక్షిణం): రుచికరమైన, పసందైన పౌష్టికాహారం ఇప్పుడు పిల్లలకు అందుతోంది. మధ్యాహ్న భోజన పథకం మెనూలో మార్పులతో ఇప్పుడు భోజనాలు చేయడానికి విద్యార్థులు ఇష్టపడుతున్నారు. ఉత్సాహంగా తింటున్నారు. విజిటబుల్ బిర్యాని, పొంగలి, కచంబరం, దద్దోజనం, నాణ్యమైన భోజనం, రుచికరమైన కూరగాయలు, పచ్చళ్లు, కోడిగుడ్డి, వేరుసెనగ పప్పు చిక్కీ వంటివి పెట్టడంతో నగరంలోని జీవీఎంసీ స్కూళ్లతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సంతృప్తికరంగా భుజిస్తున్నారు. చాలాచోట్ల తల్లులు పాఠశాలలకు వచ్చి మరీ తమ పిల్లలకు ప్రేమతో భోజనాలు తినిపిస్తుండడం కనిపించింది. ఇంటి దగ్గర కంటే మిన్నగా ఇక్కడ భోజనాలు లభిస్తున్నాయని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారంతా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి «ధన్యావాదాలు చెబుతున్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో భోజనాలు తినడానికి పిల్లలు ఇబ్బంది పడేవారు. ఇది గమనించి ఎదిగే పిల్లలకు మంచి ఆహారం అందివ్వాలనే ఉద్దేశంతో ఆర్థికంగా అదనపు భారమైనా ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజన పథకం మెనూలో మార్పులు తెచ్చారు. రోజుకో రకం భోజనం పిల్లలకు పెట్టాలని, దానికి ఎంత భారమైనా భరిస్తామని ముఖ్యమంత్రి ఆదేశాల జారీ చేశారు. ఈ పథకాన్ని అక్షయపాత్రకు అప్పగించడంతో రుచికరమైన భోజనాలు సమకూర్చుతున్నారు.
గతంలో నాసిరకం భోజనం
గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనమంటే విద్యార్థులు హడలెత్తిపోయేవారు. తినలేక చాలామంది ఇంటి నుంచి క్యారేజీ తెచ్చుకునేవారు. పాఠశాల సమీపంలో ఉండేవారు ఇంటికి వెళ్లి భోజనం చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment