కాంగ్రెస్, టీడీపీకి గుణపాఠం చెప్పండి | teach lession for congress and tdp | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, టీడీపీకి గుణపాఠం చెప్పండి

Published Tue, Mar 18 2014 12:34 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్, టీడీపీకి గుణపాఠం చెప్పండి - Sakshi

కాంగ్రెస్, టీడీపీకి గుణపాఠం చెప్పండి

కల్లూరు/పాణ్యంరూరల్, న్యూస్‌లైన్ : రానున్న స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు గుణపాఠం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానంతో అభిమానులు వెల్లువలా పార్టీలో చేరుతున్నారని అన్నారు. సోమవారం పాణ్యం మండలం తొగర్చేడులో గ్రామానికి చెందిన సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కె.చంద్రమౌళీశ్వరరెడ్డి, బి.కె.శ్రీనివాసరెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో గౌరు వెంకటరెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
 
 విద్యార్థులు, రైతులు, మహిళలతోపాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి వైఎస్సార్ కృషి చేశారని అన్నారు. ఆయన మరణం తర్వాత రాష్ట్రంలో పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు రెండుకళ్ల సిద్ధాంతంతో అటు తెలంగాణ, ఇటూ  సీమాంధ్ర ప్రజానీకానికి ద్రోహం చేశాడని విమర్శించారు. పార్టీలో చేరిన వారిలో కె.రామక్రిష్ణారెడ్డి, సి.శ్రీనివాసరెడ్డి, జయరామిరెడ్డి, తిరుపాల్ రెడ్డి, హుసేన్‌రెడ్డి, బోరగడ్డ రామసుబ్బారెడ్డి, లక్ష్మీరెడ్డి, రామచంద్రారెడ్డి మద్దిలేటి, వెంకటసుబ్బారెడ్డి, రాజశేఖరరెడ్డి, సుబ్బారెడ్డి, సురేష్, క్రిష్ణారెడ్డి, నాగేశ్వరరెడ్డి, నబీరసూల్, తిమ్మయ్య, షామద్, తిప్పన్న, శిఖామణి,, చిన్నవెంకటయ్య, లక్ష్మయ్య, రామక్రిష్ణ, నరసింహులు, మదన్, అనిల్ రాజు, మహేంద్ర తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement