నవంబర్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం : ఎంపీ షెట్కార్ | telangana bill in November Approval,Suresh Kumar Shetkar mp | Sakshi
Sakshi News home page

నవంబర్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం : ఎంపీ షెట్కార్

Published Mon, Sep 9 2013 2:14 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM

telangana bill in November Approval,Suresh Kumar Shetkar mp

వర్ని, న్యూస్‌లైన్ : అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి సీడబ్ల్యూసీలో తీసుకున్న తెలంగాణ ఏర్పాటు నిర్ణయం వెనక్కి వెళ్లే ప్రసక్తే ఉండదని ఎంపీ సురేశ్ షెట్కార్ అన్నారు. రుద్రూర్ గ్రామంలో అదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లుగా అనేక సంప్రదింపులు, చర్చలు జరిపిన తరువాతే కాంగ్రెస్ అత్యున్నత కమిటీ హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రానికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. 
 
 అయితే సీమాంధ్ర ఎంపీలు పార్లమెంట్‌లో అభ్యంతరం వ్యక్తం చేయ డం సమంజసం కాదన్నారు. నవంబర్ నెలలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు సింపుల్ మోజారిటీతో అమోదానికి వస్తుందని అన్నారు. సమైక్యా నినాదా న్ని వదిలి పెట్టి సీమాంధ్ర నాయకులు సహకరించాలని కోరారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షులు తాహెర్‌బిన్ హందాన్, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అరుణ తార, బాన్సువాడ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీనివాస్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాస్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, యూత్ కాంగ్రెస్ సెగ్మెంట్ అధ్యక్షుడు కునిపూర్ రాజిరెడ్డి, మాశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 
 
 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
 మండ లంలో వివిధ గ్రామాల్లో మంజూరైన పథకాలకు ఆదివారం ఎంపీ సురేశ్ షెట్కార్ శంకుస్థాపన చేశారు. సత్యనారాయణపురంలో రూ.5లక్షల వ్యయంతో నిర్మించనున్న ఖాదీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన , సేవాలాల్ తండాలో రూ.5 లక్షల వ్యయంతో చేపట్టనున్న  సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు.  కార్యక్రమంలో సర్పంచ్‌లు ఇందూర్ చంద్రశేఖర్, సత్యనారాయణగౌడ్  పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement