చూద్దాం..చేద్దాం ! | The development of the end of his hollow promises | Sakshi
Sakshi News home page

చూద్దాం..చేద్దాం !

Published Tue, Jun 17 2014 3:56 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

చూద్దాం..చేద్దాం ! - Sakshi

చూద్దాం..చేద్దాం !

  •      కుప్పం అభివృద్ధిపై బాబు ఉత్తుత్తి హామీలు
  •      నిధుల మాటెత్తలేదు, నిర్ధిష్టమైన భరోసా ఇవ్వలేదు
  •      సీఎంగా తొలి పర్యటనపై నియోజకవర్గ ప్రజల్లో నిరాశ
  •      4 గంటలు ఆలస్యంగా సాగిన పర్యటన
  •      పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,పారంభోత్సవాలు
  • చంద్రబాబునాయుడు కుప్పం వాసికాదు. స్థానికేతరుడు. అయినా దాదాపు 25 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తున్నారు. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నారు. మలి విడత సీఎంగా తొలిసారి నియోజకవర్గానికి విచ్చేస్తున్న చంద్రబాబు ఈ ప్రాంత అభివృద్ధికి వరాల జల్లులు కురిపిస్తారని జనం ఆశించారు. అభివృద్ధి కోసం నిధుల వరద పారిస్తారని ఎదురుచూశారు.

    అయితే చంద్రబాబు మాత్రం తొలిరోజు పర్యటనలో చూద్దాం...చేద్దాం...అన్ని విధాల అదుకుంటా అని చెప్పడం మినహా ఎలాంటి నిర్ధిష్టమైన హామీలు ఇవ్వలేదు. నిధుల మాటెత్తలేదు. వ్యవసాయం, విద్య, విద్యుత్ సరఫరాలో ఎంత కాలంలో ఏ మేరకు అభివృద్ధి  చేస్తారనే విషయూలపై విశ్వసనీయత కలిగేలా స్పష్టమైన భరోసా ఇవ్వలేదు. నియోజకవర్గంలోని రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లె, కుప్పం సభల్లో బాబు ప్రసంగంలోని మాటలే ఈ విషయూలను స్పష్టం చేశాయి. బాబుపై గంపెడాశలు పెట్టకుని సభలకు వ చ్చిన నియోజకవర్గ ప్రజలు నిరాశగా వెనుదిరిగారు.      
     
     చంద్రబాబు ప్రసంగంలో మాటలు, హామీలివీ

    పాతికేళ్లుగా నన్ను ఆదరిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి, నియోజకవర్గ ప్రజలను ఆదుకుంటా
     
     1989లో కుప్పానికి వచ్చా. అప్పట్లో పలమనేరు-కుప్పం రోడ్డు మినహా మరే రోడ్డు లేదు. ఒక్క జూనియర్ కాలేజీ మాత్రమే ఉండేది
     
     1989-94లో ప్రతిపక్షంలో ఉన్నా
     
     తిరిగి 1995-2004లో అధికారంలో ఉన్నపుడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిచేశా
     
     పదేళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది. టీడీపీ ప్రారంభించిన అన్ని పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపేసింది. కష్టనష్టాల్లో నియోజకవర్గ ప్రజలు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు
     
     డీకేటీ భూములకు పట్టాలిస్తా. 3కేఆర్ ప్రాజెక్టు కోసం రైతులు చేసిన అప్పులు మాఫీ చేస్తా  
     
     అన్ని పెలైట్ ప్రాజెక్టులను కుప్పం నుంచే ప్రారంభిస్తా. డ్రిప్, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసి తిరిగి నీటి ఎద్దడి నివారించి, వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేస్తా
     
     భూగ్భజలాలు 1000 అడుగుల లోతుకు పడిపోయూరుు. పాలారు ప్రాజెక్టును నిర్మించి తాగు, సాగునీటి కష్టాలు తీరుస్తా
     
     నియోజకవర్గంలో పిల్లల చదువులు నిర్వీర్యమయ్యాయనే ఆవేదన
     
     గతంలో సీఎంగా ఉన్నప్పుడు నియోజకవర్గంలోని ఉద్యోగులకు రిలీవర్‌లు వచ్చే వరకూ బదిలీలు చేయొద్దని ఆదేశాలు ఇచ్చా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా బదిలీలు చేసింది. దాంతో నియోజకవర్గంలో 570 టీచర్ పోస్టులు, 20 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నారుు. వీటన్నిటిపై త్వరలో సమీక్షిస్తా  
     
     రామకుప్పం మోడల్ స్కూలును ఈ ఏడాది నుంచే జూనియర్ కాలేజీలో నడిపేలా ఆదేశిస్తా  
     
     మార్కెట్ యార్డు, ఆంబూరు వరకూ 34 కిలోమీటర్ల రోడ్లు, ఎస్‌టీలకు కల్యాణ మంటపాలు, ముస్లింలకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రుణాలు, ఎస్‌సీలకు అంబేద్కర్ భవనాలు నిర్మించాలని కోరుతున్నారు. వీటన్నిటినీ పరిశీలిస్తా
     
     నియోజకవర్గంలో పాడిపరిశ్రమను అభివృద్ధి చేశా. పారిశ్రామికరంగంపై కూడా దృష్టి సారిస్తా
     
     ఇజ్రాయిల్ టెక్నాలజీని తీసుకొచ్చి వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేశా. తిరిగి ఇక్కడ వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా. మళ్లీ 3కేఆర్‌నే ఏర్పాటు చేసి 15-20వేల ఎకరాల్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తాం
     
     రైతులకు 9గంటలు కరెంటు ఇవ్వాలని, త్వరలోనే నాణ్యమైన కరెంటు వచ్చేలా చూస్తా  
     
     రాళ్లపొద్దుటూరులో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తాం       
     
     ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు, సభలు  

     రామకుప్పంలో కొత్తగా 1.24 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కాలేజి భవనాన్ని ప్రారంభించారు. 3.02 కోట్లతో నిర్మించనున్న మోడల్ స్కూలు భవనానికి శంకుస్థాపన చేశారు. పోలీస్‌స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
     
     అక్కడి నుంచి కెంచనబళ్ల చేరుకున్నారు. కెంచనబళ్ల మాజీ సర్పంచ్ నారాయణఆచారి ఇంటికెళ్లారు. త్వరలో వివాహం చేసుకోబోతున్న నారాయణ కుమార్తె, అల్లుడిని ఆశీర్వదించారు.
     
    శాంతిపురం చేరుకుని ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బహిరంగసభలో మాట్లాడారు. 130 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థుల కోసం అగస్త్యా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన బస్సును ప్రారంభించారు. సివిల్‌సప్లరుుస్ గోడౌన్‌లోని అదనపు గదులను ప్రారంభించారు. కుప్పంలో 50లక్షలు, శాంతిపురంలో 25 లక్షలతో నిర్మించే సివిల్ సప్లరుుస్ గోడౌన్‌లకు శాంతిపురంలోనే శంకుస్థాపన చేశారు. పీఎంజీవై కింద 5.36 కోట్ల రూపాయలతో రోడ్డునిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
     
     గుడుపల్లె, కుప్పంలో బహిరంగసభల్లో మాట్లాడారు. కుప్పం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆపై పార్టీ పరిశీలకులతో సమావేశమయ్యారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో రాత్రి బస చేశారు.    
     
    పర్యటన నాలుగు గంటల ఆలస్యం

    ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటనలో తొలి రోజు సోమవారం ఉదయం 9.30 గంటలకు చంద్రబాబు రామకుప్పం రావాల్సి ఉంది. అయితే కృష్ణా జిల్లాలో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌రావు ఆకస్మికంగా మృతిచెందడంతో అక్కడికి వెళ్లారు. చంద్రబాబు మధ్యాహ్నం 1.27 గంటలకు రామకుప్పంలోని సత్యలోక్ ఆశ్రమం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.
     
     అటవీశాఖ రాష్ట్రమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి,  ఎంపీ శివప్రసాద్, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు చంద్రబాబుకు స్వాగతం పలికారు.     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement