వైవీయూ, న్యూస్‌లైన్ : రాజకీయ కారణాలతో రాష్ట్రాలను విడగొట్టడం తగదని రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఒకవేళ విభజన జరిగితే జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ అంతర్రాష్ట్ర ప్రాజెక్టులవుతాయని, అప్పుడు నీటికేటాయింపులు రాష్ట్రాల చేతుల్లో ఉండవని ఆయన పేర్కొన్నారు. మిగులు జలాలపై ఆధారపడి నిర్మితమైన ప్రాజెక్టులు నుంచి కేటాయింపులు ఉండవన్నారు. అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ఒకవేళ విభజన అనివార్యమైతే మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలను సీమాంధ్రలో కలిపి 16 జిల్లాలను ఓ రాష్ట్రంగా ఏర్పాటు చేసి 7 జిల్లాలతో తెలంగాణ ఏర్పాటు చే యాలన్నారు.
అలాగే హైదరాబాద్‌పై అధ్యయనం చేసి ఇరుప్రాంతాలకు న్యాయం చేయాలన్నారు. అనంతరం వైఎస్ వివేకా మాట్లాడుతూ ప్రపంచమంతా ఒక గ్రామంలా కలిసిపోతున్నాయన్నారు. చాలా దేశాలు యునెటైడ్‌గా ఏర్పడి అభివృద్ధి చెందుతున్న తరుణంలో విభజన పేరుతో మనదేశాన్ని ముక్కలు చేయడం సమంజసం కాదన్నారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి జలాల కేటాయింపుల్లో గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. అన్ని పార్టీల నేతలు ఉద్యమంలో పాల్గొనాలన్నారు. పా ర్టీల నిర్ణయాలకంటే ప్రజాభీష్టమే ముఖ్యమని తెలిపారు. అన్ని పార్టీల నేతలు పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలన్నారు.
రాష్ట్ర విభజన తగదు
Published Sat, Aug 24 2013 4:41 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM
Advertisement