- రాహుకేతు పూజలు ఇకపై రెండు రకాలే ?
- వీఐపీలకే రూ.2,500 రాహుకేతు పూజా టికెట్లు
- అంతా ఆన్‌లైన్ చేసే ఆలోచనలో అధికారులు
- ధూర్జటి కళాపీఠం ఏర్పాటుకు సన్నాహాలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిత్యం జరిగే పూజలతో పాటు అభిషేకాల్లో మార్పులు చేయడానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఆ మేరకు ఈవో బీ.రామిరెడ్డి తన చాంబర్ లో దేవస్థానం ప్రధాన అర్చకుడు బాబుగురుకుల్, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే, సాహితీవేత్త, దేవస్థానం ఆస్థాన పండితుడు సాయికృష్ణయాచేంద్రతో ఆది వారం నాలుగు గంటల పాటు చర్చించారు. పూజలతో పాటు అభిషేకాల టికెట్లు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. పలు సేవా టికెట్లు కుదించనున్నా రు. ప్రస్తుతం రూ.300, రూ.750, రూ.1500, రూ.2500 టికెట్ల ద్వారా రాహుకేతు పూజలు చేస్తున్నారు. ఇకపై అలా కాకుండా కేవలం రూ.1000 టికెట్ ద్వారా మాత్రమే ఆలయం వెలుపల ప్రత్యేక మండపంలో రాహుకేతు పూజలు చేయాలని భావిస్తున్నారు.
ఆలయం లోపల కేవలం వీఐపీలకు మాత్రమే రూ.2,500 టికెట్ ద్వారా రాహుకేతు పూజలు చేసేలా చర్యలు చేపట్టనున్నారు. అవి కూడా 50లోపే కేటాయించనున్నారు. రు ద్రాభిషేకం, పచ్చకర్పూరాభిషేకం టికెట్లనూ కుదించనున్నారు. పలు అభిషేకాల టికెట్లు రోజుకు 50లోపే ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక ధూర్జటి కళాపీఠం ఏర్పాటు చేయాలని చర్చించారు. ఆలయ చరిత్రను తెలిపే అన్ని రకాల పుస్తకాలు గ్రంథాలయంలో లభించేలా చర్యలు తీసుకోనున్నారు. సాయికృష్ణ యాచేంద్ర గతంలో(15ఏళ్ల క్రితం) ఇదిగో దక్షిణ కైలాసం అనే అద్భుతమైన సీడీని తయారుచేసి ఆలయానికి బహూకరించారు. అలాగే జ్ఞానప్రసూనాంబపై ఏడు స్తోత్రాలతో భక్తిభావాన్ని తెలిపే కీర్తనలు రూపొందించానని, త్వరలో ఆలయానికి అందజేస్తానని ఆయన ఈవోకు తెలిపారు.
ముక్కంటి చెంత మార్పులకు శ్రీకారం
Published Mon, May 18 2015 4:55 AM | Last Updated on Mon, Jul 29 2019 6:06 PM
Advertisement
Advertisement