చిత్తూరు జిల్లా పెద్దమండెం పోలీస్‌స్టేషన్ ఎదుట గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేశారు.
చిత్తూరు: చిత్తూరు జిల్లా పెద్దమండెం పోలీస్‌స్టేషన్ ఎదుట గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేశారు. వివరాలు.. ఈ నెల 20వ తేదీన మండలంలోని బండకిందతాండకు చెందిన రవినాయక్ పై నాటుసారా అమ్ముతున్నాడని పోలీసులు కేసు పెట్టారు. ఈ విషయమై పోలీసులు రవినాయక్ ను స్టేషన్ పిలవగా కొడతారేమోననే భయంతో రవి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అక్రమ కేసులు పెట్టి రవినాయక్‌ను వేధిస్తున్నారని గిరిజనులు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.