కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తా: జగ్గారెడ్డి | turpu jayaprakash reddy contest on TRS President KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తా: జగ్గారెడ్డి

Published Fri, Feb 28 2014 5:35 PM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM

కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తా: జగ్గారెడ్డి

కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తా: జగ్గారెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు మాటమారుస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) విమర్శించారు. దొంగ మాటలతో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ పునర్‌ నిర్మాణం కేసీఆర్‌కే కాదు, తమకూ తెలుసునని చెప్పారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం కాకుంటే ఆ పార్టీకే నష్టమన్నారు. సొంతంగా పోటీ చేస్తే టీఆర్ఎస్ ఓడిపోతుందని, 10 సీట్లు కూడా రావని అన్నారు.

టీఆర్ఎస్ విలీనం చేయకుంటే ఆ పార్టీలో కేసీఆర్ కుటుంబ సభ్యులే మిగులుతారని చెప్పారు. టీఆర్ఎస్‌ విలీనం చేయకపోవడం ప్రజలు, కాంగ్రెస్‌ను మోసం చేయడమే అన్నారు. పార్టీ ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తానని జగ్గారెడ్డి దీమా వ్యక్తం చేశారు. తన సంగారెడ్డి సీటుకు ఎసరు పెట్టే సత్తా టీఆర్ఎస్కే కాదు, కాంగ్రెస్‌ నాయకులకు లేదని  పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement