
వి.లక్ష్మణ్‌రెడ్డి
సాక్షి, గుంటూరు: చంద్రబాబు మద్యం చుట్టూ రాజకీయం చేస్తున్నారని మద్యవిమోచన ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షకుడు వి.లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మద్యాన్ని విస్తృతంగా విక్రయించాలని చెబుతున్నారని మండిపడ్డారు. లక్షలమంది పేదల జీవితాలను నాశనం చేసేలా ఆయన సలహాలు ఉన్నాయని విమర్శించారు. (గ్యాస్ లీక్ ఘటనపై విచారణ జరిపిస్తాం : గౌతమ్‌రెడ్డి)
మహిళలు ఓట్ల రూపంలో ఛీకొట్టినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని మండిపడ్డారు. తాగుబోతుల సంఘం అధ్యక్షుడిగా ఆయన మాటలున్నాయని ఎద్దేవా చేశారు. పేదలకు కిలో బియ్యం ఇవ్వలేని టీడీపీ నేతలు మద్యం సరఫరా చేయాలనటం సిగ్గుచేటు అని లక్ష్మణ్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment