హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : మహాజన సోషలిస్ట్ పార్టీ(ఎంఎస్‌పీ) వర్ధన్నపేట నియోజకవర్గ అభ్యర్థిగా ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బరిలోకి దిగనున్నారు. మండలంలోని దివ్య గార్డెన్‌సలో రెండురోజుల పాటు నిర్వహించిన పార్టీ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల్లో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వరంగల్‌లోని న్యూశాయంపేట మందకృష్ణ మాదిగ స్వస్థలం.
వర్ధన్నపేట నియోజకవర్గం ఈ ప్రాంతానికి సమీపంలో ఉండడం, హసన్‌పర్తి, హన్మకొండ మండలాలు ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలబడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అలాగే ఈ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మందకృష్ణ మాదిగ బంధువులు, స్నేహితులు ఎక్కువ సంఖ్యలో ఉండడం కూడా ఇంకో కారణంగా కనిపిస్తోంది. అంతేకాక ఈ నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఇక్కడినుంచి పోటీ చేస్తే సులభంగా విజయం సాధించవచ్చనేది మందకృష్ణ ఆలోచనగా చెబుతున్నారు.
సంవత్సర కాలంగా..
వర్ధన్నపేట నియోజకవర్గంపై సంవత్సర కాలంగా మందకృష్ణ మాదిగ ప్రత్యేక దృష్టి పెట్టారు. సభలు, సమావేశాలు తదితర వాటిని ఇక్కడే ఎక్కువ నిర్వహించారు. ఇటీవల వర్ధన్నపేటలో వితంతువులు, వృద్ధుల సభతోపాటు వికలాంగుల సమావేశాలు కూడా నిర్వహించారు. హసన్‌పర్తి మండలంలోని వంగపహాడ్‌లో ఇటీవల నిర్వహించిన తెలంగాణ అమరుల తల్లుల కడుపుకోత సభకు మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వర్ధన్నపేట బరిలో మంద కృష్ణ!
Published Thu, Jan 9 2014 3:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
Advertisement
Advertisement