ఏటూరునాగారం, న్యూస్‌లైన్ : నిరుపేదల అభ్యున్నతి కోసమే మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్‌పీ)ని స్థాపించామని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. శుక్రవారం ఏటూరునాగారం మండల కేంద్రంలో ఎంఎస్‌పీ జెండాను అనంతరం సభలో ఆయన మాట్లాడారు. బడుగుబల హీన వర్గాల అభివృద్ధిని ప్రస్తుత పాలకు విస్మరించారని, కేవలం వారి స్వలాభాల కోసం తాపత్రయ పడుతున్నారని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఓట్లతో గెలుపొందిన ఎమ్మెల్యేలు ఏనాడూ ఆ వర్గాల కోసం అసెం బ్లీలో మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. వికలాంగుల సంక్షేమం కోసం అనేక పథకాలు పెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న నాయకు లు ఆచరలో పెట్టడం లేదన్నారు. ఎన్నికల సమ యం సమీపిస్తుండడంతో అనేక పార్టీల నాయకులు ఓట్ల కోసం ప్రజలను మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మంద కృష్ణ మండిపడ్డారు.
పాలకులు మారుతున్నారే గానీ ప్రజల తలరాత మారడం లేదన్నారు. మహాజన సోషలిస్టు పార్టీతో రాజ్యాధికారం చేపట్టి స్వరాష్ట్ర పాలనను సాధించుకుందామని పిలుపునిచ్చారు. సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అడ్డుకోవాలని చూస్తున్నారని, వారి కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రతి తెలంగాణ వాది సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు.
అనంతరం ఇగ్నో యూనివర్సీటీ ఫ్రొఫెసర్ రీయాజ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య తెలంగాణ కావాలని, దొరల తెలంగాణ కాదన్నారు. తెలంగాణలో ఉన్న పార్టీలు కేవలం సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని, ప్రజలకోసం కాదన్నారు. పేదలు దుర్భర జీవితాలను గడుపుతున్నారని, ధనికులు మాత్రం మేడలపై మేడలు కడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదల అభ్యున్నతి కోసమే పార్టీ ఏర్పాటు
Published Sat, Jan 18 2014 6:31 AM | Last Updated on Thu, Jul 11 2019 8:03 PM
Advertisement
Advertisement