కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి వెళ్లొద్దు | don't go to kcr Sworn in says mandha krishna | Sakshi
Sakshi News home page

కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి వెళ్లొద్దు

Published Mon, Jun 2 2014 1:12 AM | Last Updated on Mon, Oct 8 2018 3:00 PM

don't go to kcr Sworn in says mandha krishna

పార్టీల నేతలకు మంద కృష్ణ బహిరంగ లేఖ

 హైదరాబాద్ : దళిత జాతిని మోసం చేసిన టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ఎవరూ హాజరు కావొద్దని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ వివిధ పార్టీల నేతలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన టీఆర్‌ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడెందుకు ఆ పీఠం మీద కూర్చునేందుకు తహతహలాడుతున్నారని ప్రశ్నించారు. ఎన్ని నిర్బంధాలు సృష్టించినా కేసీఆర్ ప్రమాణ స్వీకారాన్ని వ్యతిరేకిస్తూ తాము నిరసన  ర్యాలీ నిర్వహించి తీరుతామని చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement