
సాక్షి, అమరావతి : బీజేపీ సంఘటనా పర్వ్ 2019 సభ్యత నమోదు కార్యక్రమాన్ని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్‌రాజు ఆదివారం ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని కొనియాడారు. విశాఖ భూ కుంభకోణంలో సిట్ నివేదిక బహిర్గతం చేయాలని అందులో ఉన్న పచ్చపాములు బండారం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.