నాయుడుపేటటౌన్: పుదూరు పొలాల్లో ఉన్న బావి నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్న మహిళలు
జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. వరుసగా మూడేళ్ల నుంచి వర్షాలు లేకపోవడంతో నీటి వనరులు పూర్తిగా అడుగంటాయి. వేసవిలో నీటి సమస్య ఉండే అవకాశం ఉన్న సంగతి తెలిసినా ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. బోరుబావులు, రక్షిత మంచినీటి ప«థకాలకు మరమ్మతులు చేయలేదు. దీంతో నీటి సరఫరా చేసే వ్యవస్థ దెబ్బతింది. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు క్షేత్ర పర్యటన చేసి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నారనేఆరోపణలున్నాయి.
నెల్లూరు, ఉదయగిరి: తాగునీటి అవసరాల కోసం జిల్లాలోని పలు పంచాయతీల్లో అందుబాటులో ఉన్న నిధులను అధికారపార్టీ నేతలు ఎన్నికలకు ముందు అరకొరగా పనులు చేసి ఉన్న కాస్త పైసలు కాజేశారు. దీంతో పంచాయతీ ఖాతాల్లో బ్యాలెన్స్ నిండుకుంది. దీంతో బోర్లకు, తాగునీటి మోటార్లకు మరమ్మతులు చేపట్టేందుకు వీలు లేకుండా ఉందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 940 గ్రామ పంచాయతీలు, 3,120 ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం అధికారంగా 320 గ్రామాల్లో నీటి సమస్య ఉందని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా అంతకంటే రెట్టింపు సంఖ్యలో ఉన్నాయి. ప్రస్తుతం 148 ట్యాంకర్లు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అవసరాల మేరకు సరఫరా జరగడం లేదని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. మూగ జీవాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తాగేందుకు నీరు లేక అనేక మంది పశుపోషకులు తక్కువ ధరకే వాటిని తెగనమ్ముకుంటున్నారు.
మెట్టలో దారుణం
డెల్టా ప్రాంతంలో తాగునీటి సమస్యతో పోల్చుకుంటే మెట్టలో మరింత దారుణంగా ఉంది. కొన్ని గ్రామాల్లో బిందెడు నీటి కోసం పనులు మానుకొని అదే పనిలో ఉండాల్సి పరిస్థితి. ఉదయగిరి నియోజకవర్గంలో 400 ఆవాస ప్రాంతాలు ఉంటే వీటిలో 280 గ్రామాల్లో నీటి సమస్య ఉంది. ప్రస్తుతం 108 ఆవాస ప్రాంతాల్లో మాత్రమే నీటి సరఫరా ట్యాంకర్లు ద్వారా చేస్తున్నారు.
వింజమూరు, ఉదయగిరి, కొండాపురం, కలిగిరి
సీతారామపురం, రాపూరు, డక్కిలి, పొదలకూరు, వెంకటగిరి, సైదాపురం, ఏఎస్ పేట, సూళ్లూరుపేట తదితర మండలాలలో నీటి తీవ్రత అధికంగా ఉంది. ఈ ప్రాంతాల్లో వర్షాలు లేక నీటి వనరులైన చెరువులు, బావులు, బోరుబావులు పూర్తిగా ఎండిపోయాయి. పైగా ఎండ తీవ్రత 47 డిగ్రీలకు చేరుకోవడంతో కాస్త ఉన్న నీటì జాడలు కూడ వట్టిపోతున్నాయి. సముద్ర తీర ప్రాంత గ్రామాలు కూడ నీటి కోసం అల్లాడిపోతున్నాయి. వింజమూరు, ఉదయగిరి పట్ణణాలలో తీవ్రర çనీటి సమస్య నెలకొంది. ట్యాంకర్లు ద్వారా నీరు సరఫరా చేసినా ప్రజల అసరాలను తీర్చే పరిస్థితి లేదు.
పట్టించుకోని ప్రభుత్వం
కొన్ని గ్రామాల్లో నీటి కోసం ప్రమాదఘంటికలు మోగుతున్నా అధికారులకు, ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. పంచాయతీల్లో నీటి అవసరాల కోసం నిల్వ ఉంచిన నగదును అధికారపార్టీ నేతలు వివిధ రకాల పనులు చేసి నిబంధనలకు విరుద్ధుంగా కాజేశారు. పైగా పంచాయతీ ఖాతాల్లో ఉన్న నగదును ప్రభుత్వం ఎన్నికలకు ఓటరు తాయిలాల కోసం వాడేసింది. దీంతో తీవ్ర నగదు కొరత ఏర్పడింది. చిన్న పనులు చేయాలన్నా డబ్బు లేకçపోవడంతో సమస్య పరిష్కారం కావడం లేదు. పైగా నెలలు తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో పనులు చేసేందుకు ఏవరూ ముందుకు రావడం లేదు. దీంతో సమస్య పరిష్కారం కావడం లేదు.
తాగునీటి సమస్యనివారణకు చర్యలు
తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్లు ద్వారా నీరు సరఫరా చేస్తున్నాం. ఎక్కడైనా అవసరమైతే స్థానికంగా ఉన్న ఎంపీడీఓను కలసి వినతిపత్రం అందజేయాలి– శ్రీనివాసరావు, ఈఈ
Comments
Please login to add a commentAdd a comment