తిరుపతి రైల్వేస్టేషన్ అభివృద్ధి ఎన్నడు?
ఆదాయానికి తగ్గ ప్రాధాన్యం లభించేనా..
నేడు పార్లమెంట్‌లో రైల్వే బడ్జెట్
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: వరల్డ్‌క్లాస్ స్థాయిలో తిరుపతి రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తామంటూ రైల్వేశాఖ ప్రకటించి నాలుగేళ్లయింది. ఇప్పటి వరకూ ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అనంతరం మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామంటూ తిరుపతి పర్యటనకు వచ్చిన రైల్వే మంత్రులు ప్రకటిస్తూ వచ్చారు. బుధవారం రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలో ఈ సారైనా తిరుపతి రైల్వే స్టేషన్‌కు ప్రాధాన్యం లభిస్తుందని తిరుపతివాసులు ఆశిస్తున్నారు.
దక్షిణమధ్య రైల్వేకి అత్యధిక ఆదాయం సమకూరుస్తున్న స్టేషన్‌గా తిరుపతికి పేరుంది. ప్రతిసారీ రైల్వే మంత్రి, సహాయ మంత్రి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఉండడంతో దాదాపు దక్షిణమధ్య రైల్వే జోన్‌కు
తీరని అన్యాయమే జరుగుతూ వచ్చింది. ప్రస్తుతం రైల్వే సహాయ మంత్రిగా రాయలసీమకు చెందిన ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నారు. ఈయన బాధ్యతలు చేపట్టి ఏడాది దాటినా తిరుపతి స్టేషన్ అభివృద్ధికి తీసుకున్న చర్యలు శూన్యం.
జిల్లాలోని ప్రధాన రైల్వే సమస్యలు
తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి.
జిల్లావ్యాప్తంగా సుమారు 15వేల మంది రైల్వే కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. వీరి కోసం తిరుపతిలో రైల్వే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాల్సి ఉంది.
తిరుపతి స్టేషన్‌లో ప్రయాణికుల భద్రతకు సరిపడా మెటల్ డిటెక్టర్లు, సీసీ కెమెరాలు లేవు.
తిరుపతిలోని మెకానికల్, సేఫ్టీ, రైల్వే పోలీస్, ఎలక్ట్రికల్, శానిటరీ విభాగాల్లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి.
రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు శుభ్రమైన నీరు అందడం లేదు.
తిరుపతి రైల్వేస్టేషన్‌కు నిత్యం వేలమంది వచ్చి పోతుంటారు. వీరు స్టేషన్ వద్ద తమ వాహనాలను పార్క్ చేసుకునేందుకు ప్రత్యేకంగా స్థలం లేదు.
చిత్తూరు మార్గంలోని జాతీయ రహదారిపై మూడు చోట్ల రైల్వే గేట్లు ఉండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉంది.
పాకాల, మదనపల్లె, శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లలో ఒకే రిజర్వేషన్ కౌంటర్ ఉండడంతో ప్రయాణికులు టిక్కెట్ల కొనుగోలులో అవస్థలు పడుతున్నారు.
కొత్త రైళ్లు ఏర్పాటు చేయాలి
తిరుపతి నుంచి షిరిడీకి వారంలో రెండురోజుల పాటు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలి.
దక్షిణాది రాష్ట్రాల్లోని అన్ని పుణ్య స్థలాలను సందర్శించేందుకు వీలుగా ‘తీర్థా స్పెషల్’ రైలును తక్షణం ఏర్పాటు చేయాలి.
శ్రీకాళహస్తి నుంచి మదన పల్లె లేదా నెల్లూరు నుంచి మదనపల్లె వరకు ప్యాసింజర్ రైలు ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించారు. దీనిని అమలు చేయాలి.
తిరుపతి-రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి.
{పస్తుతం తిరుపతి నుంచి సికింద్రాబాద్ వరకు పాకాల, ధర్మవరం మార్గంలో నడుస్తున్న రైళ్ల సంఖ్యను నాలుగు రెట్లు పెంచాలి.
కడప నుంచి మదనపల్లె మీదుగా బెంగళూరు వరకు ఏర్పాటు చేయనున్న కొత్త రైల్వేలైన్‌కు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలి.
తిరుపతి నుంచి తమిళనాడులోని వేలూరు వరకు డబ్లింగ్ రైల్వేట్రాక్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలి.
శ్రీకాళహస్తి నుంచి నడికుడి వరకు కొత్త రైల్వేలైన్ పనులను త్వరగా పూర్తి చేయాలి.
కొత్త కళ వచ్చేనా?
Published Wed, Feb 12 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
Advertisement
Advertisement