బెంగళూరు, న్యూస్‌లైన్: జీవోఎంలో అన్ని అంశాలపై క్షుణ్ణంగా చర్చించిన తర్వాతే నివేదిక ఇవ్వాలని, లేకపోతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు వెల్లడించారు. సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని యూపీఏ భాగస్వామ్య పార్టీలను కోరుతున్నామని చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చే ఎంపీలు, ఎమ్మెల్యేలకే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని మాజీ ప్రధాని దేవెగౌడను కోరడానికి బుధవారం ఇక్కడకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర ఎంపీలు డ్రామాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 11 అంశాలపై సమగ్రమైన చర్చ జరగకుండానే జీవోఎం నివేదికను సిద్ధం చేస్తోందని ధ్వజమెత్తారు.
విద్య, ఉద్యోగాలు, నీటి పంపకం, రాష్ర్ట సరిహదులపై చర్చించకుండానే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, కర్ణాటకలో ప్రవాసాంధ్రులు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏపీ రెవెన్యూ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఏపీ ప్రైవేటు విద్యా సంస్థల అధ్యక్షుడు చిరంజీవిరెడ్డి, ఏపీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ గంగప్ప, కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి, సీపీ. బ్రౌన్ సేవా సమితి అధ్యక్షుడు ఇడమకంటి లక్ష్మీ రెడ్డి పాల్గొన్నారు.
జీవోఎం అసమగ్ర నివేదికిస్తే సుప్రీంను ఆశ్రయిస్తాం
Published Thu, Nov 21 2013 2:56 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement