నరికే వారు లేక ఇక్కట్లు
ఆందోళనలో చెరకు రైతులు
పంట మిగులుతుందని బెరుకు
దళారులకే కట్టబెడుతున్న వైనం
జహీరాబాద్, న్యూస్‌లైన్:
చెరకు పంటను నరికేందుకు కూలీ ల కొరత ఏర్పడింది. దీంతో చెరకును కర్మాగారానికి తరలించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత క్రషింగ్ సీజన్‌లో జహీరాబాద్‌లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగార యాజమాన్యం ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను పిలిపించలేదు. కొందరు రైతులు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి కూలీలకు అడ్వాన్స్ చెల్లించి రప్పించుకున్నారు. సుమారు 70 గ్యాంగ్‌ల మేరకు రైతులు స్థానికేతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చారు. ఒ క్కో గ్యాంగ్‌లో 15 నుంచి 20 మంది వరకు కూలీలు ఉంటారు. కర్మాగారానికి పరిసర ప్రాంతాల్లోని గ్రామాల రైతులు మాత్రం ఎడ్ల బండ్లను అద్దెకు తీసుకుని చెరకును తరలిస్తున్నారు. ఈ ఏడాది జోన్ పరిధిలో చెరకు పంట అధికంగా సాగులో ఉండడంతోపాటు కర్మాగారంలో క్రషింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో చెరకును తరలించే విషయంలో రైతులు ఇబ్బందులకు గు రవుతున్నారు. రైతులు స్థానిక కర్మాగారంపై ఆశలు పెట్టుకోకుండా ప్రత్యామ్నా య మార్గాలను అన్వేషిస్తున్నారు. పలువురు రైతులు ఇప్పటికే తమ ఉత్పత్తులను ఇతర కర్మాగారాలకు తరలిస్తున్నారు.
26 వేల ఎకరాల్లో సాగు..
జోన్ పరిధిలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్‌కల్, రాయికోడ్ మండలాల్లో సుమారు 26 వేల ఎకరాల్లో చెరకు సాగులో ఉంది. మరో 1.50 లక్షల టన్నుల మేర కర్మాగారం యాజమాన్యం అగ్రిమెంట్ చేసుకోకుండా ఉన్న సాగులో ఉందనే అంచనా. ఎకరాకు 25 టన్నుల మేర దిగుబడి వస్తే ఈ లెక్కన జోన్ పరిధిలో సుమారు 8 లక్షల టన్నుల మేర పంట ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందంటున్నారు రైతులు. కర్మాగారం సామర్థ్యం రోజుకు 3,500 టన్నులు ఉంది. కర్మాగారం నవంబర్ 15న క్రషింగ్ పూజను నిర్వహించింది. అనంతరం వర్షాలు కురియడంతో డిసెంబర్ మొద టి వారం వరకు క్రషింగ్ మందకొడిగా సాగింది. ప్రస్తుత సామర్థ్యం మేరకు క్రషింగ్ చేస్తున్నా సాగులో ఉన్న చెరకు పంటను పూర్తి స్థాయిలో క్రషింగ్ చేయడం సాధ్యపడదంటున్నారు. దీం తో చెరకు ఉత్పత్తులు ఇతర కర్మాగారాలకు తరలిపోతున్నాయి. ఇప్పటివరకు 1.60 లక్షల టన్నుల చెరకు పంట మా త్రమే గానుగాడింది. ఫిబ్రవరి మాసం నుంచి ఎండల పెరుగుతాయని, దీంతో కూలీలు పంటను నరికేందుకు రెట్టింపు కూలి డిమాండ్ చేసే అవకాశం ఉంటుం దంటున్నారు. అన్ని పరిస్థితులను బేరీజు వేసుకున్న రైతులు సాగులో ఉన్న పంట ను సాధ్యమైనంత తొందరగా కర్మాగారాలకు తరలించాలనే ఆసక్తితో ఉన్నారు.
దళారులదే హవా..
ఇదే అదనుగా భావిస్తున్న దళారులు రైతులకు టన్నుకు రూ.1,800 చొప్పున ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. చెరకు కోత, రవాణా ఖర్చులు వారే భరిస్తున్నారు. ట్రైడెంట్ యాజమాన్యం మాత్రం టన్నుకు రూ.2,600 ధర చెల్లిస్తోంది. ఇక్కడ చెరకు కోత, రవాణా చార్జీలను మాత్రం రైతులే భరిస్తున్నారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి భయాందోళనలు చెందరాదని, సాగులో ఉన్న చెరకు పంటను పూర్తిగా క్రషింగ్ చేస్తామని కర్మాగారం అధికారులు రైతులకు భరోసా ఇస్తున్నారు. అయినా రైతులు వారి మాటలను నమ్మక తొందరపడుతున్నారు. రైతుల బలహీనతలను ఆసరాగా చేసుకుని దళారులు లబ్ధిపొందుతున్నారు.
కూలీల కొరత తీవ్రం
Published Mon, Jan 20 2014 11:41 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement