
వైఎస్ స్ఫూర్తిగా పేదలకు సాయపడాలి
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆదర్శంగా తీసుకొని రెడ్డి సామాజికవర్గం ముందుకుసాగాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సూచించారు.
ఎమ్మెల్యే ఆర్కే
తాడేపల్లి రూరల్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆదర్శంగా తీసుకొని రెడ్డి సామాజికవర్గం ముందుకుసాగాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సూచించారు. ఉండవల్లి కరకట్ట వద్ద గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో ఆదివారం కొండవీడు అకాడమీ రెడ్డి సామాజికవర్గం ఆధ్వర్యంలో వనసమారాధన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్యెల్యే ఆర్కే మాట్లాడుతూ డాక్టర్ వైఎస్‌ను స్ఫూర్తిగా తీసుకుని పేదప్రజలకు సహాయపడాలని సూచించారు.
వైఎస్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలే నేటికీ ప్రజలకు ఎంతగానోల మేలు చేస్తున్నాయని కొనియాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించినా నేటికీ ప్రజల గుండెల్లో జీవిం చి ఉండడానికి కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ భరోసా ఇవ్వడమే కారణమని ఆర్కే పేర్కొన్నారు. స్వదేశంలోనేకాక విదేశాల్లో ఉన్న రెడ్డి సామాజికవర్గం సైతం పేద ప్రజల అభ్యున్నతిలో భాగస్వాములు కావాలని కోరారు. వైఎస్‌నుఆదర్శంగా తీసుకుని తాను ప్రజా సేవచేసేందుకు రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆర్కే తెలిపారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబిం బిస్తూ పంచికట్టుతో పెద్దాయన ఆనే పలకరింపుతో ప్రజల్లో ఒకరిగా జీవిం చిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యమంటూ అన్నదాతలకు అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు.
ఆ మహానేత స్పూర్తిగా రెడ్డి సామాజికవర్గం విస్కృతంగా సమాజసేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కొండవీడు అకాడమీకి విరాళాలు అందించిన వారికి ఎమ్మెల్యే ఆర్కే చేతుల మీదుగా సన్మానం చేశారు. కార్యక్రమంలో అఖిల భారతరెడ్డి సామాజికవర్గ సంఘ అధ్యక్షులు వీరారెడ్డి, మానం వెంకటరెడ్డి, కాకతీయ అకాడమీ అధ్యక్షుడు బోయపాటి సుబ్బారెడ్డి, తాడేపల్లి మాజీ ఎంపీపీ దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.