
చంద్రబాబును A-1గా ఎందుకు చేర్చలేదు: వైఎస్ జగన్
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడును A-1గా ఎందుకు చేర్చడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఆయనపై ఎందుకు కేసు నమోదు చేయటం లేదని సూటిగా అడిగారు. రేవంత్ రెడ్డి ముడుపులకు సంబంధించి వైఎస్ జగన్ మంగళవారం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఈ సందర్భంగా ఓటుకు నోటు వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. ఓటుకు నోటు సూత్రధారులను అరెస్ట్ చేయాలని కోరారు.
గవర్నర్తో భేటీ అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో చంద్రబాబు డబ్బులతో రాజకీయం చేశారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనాలని చంద్రబాబు చూశారన్నారు. ఓ వైపు డబ్బులు లేవంటున్న చంద్రబాబుకు అయిదు కోట్ల రూపాయిలు ఎక్కడ నుంచి వచ్చాయని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఏడాది కాలంలో ఇన్ని కోట్లు ఎలా వచ్చాయని అడిగారు. ఓటుకు నోటు సూత్రధారులను అరెస్ట్ చేయాలని కోరారు. వైఎస్ జగన్తో పాటు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలు కూడా గవర్నర్ను కలిశారు.