విశాఖ: వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన దీక్ష ఉద్యమకారులకు బలాన్ని పెంచిందని రాజకీయ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై సమన్యాయం పాటించాలంటూ విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్షను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ దీక్షతో కాంగ్రెస్ నేతల కళ్లు తెరుచుకోవడం ఖాయమన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రోజు రోజుకూ ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారని ఆయన విమర్శించారు.
ప్రస్తుతం ఆహార భద్రత బిల్లును వ్యతిరేకిస్తేనే విభజన అంశం ఆగుతుందన్నారు. ఆహార భద్రత బిల్లు పాస్ అయితే సీమాంధ్ర ఎంపీల అవసరం ఉండకపోవచ్చని పుల్లారావు అభిప్రాయపడ్డారు.