'అంతమాత్రాన చంద్రబాబు స్మగ్లర్ అవుతారా?'
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను రాజకీయ ప్రత్యర్థులుగా కాకుండా శత్రువులుగా భావించి టీడీపీ అణగదొక్కాలని చూస్తోందని చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. గంగాధర నెల్లూరుకు చెందిన పార్టీ కార్యకర్త విజయానందరెడ్డిపై రాజకీయ కోణంలోనే స్మగ్లర్ అని కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. రాజమండ్రి జైలులో ఉన్న విజయానందరెడ్డిని పరామర్శించటం తన బాధ్యతగా అనుకున్నానన్నారు. అయితే దీనిపై కొన్ని ఛానల్స్ రకరకాల క్లిప్సింగ్స్ వేస్తూ ఆరోపణలు చేయటం సరికాదన్నారు.
తానెప్పుడూ ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించలేదని చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్పష్టం చేశారు. అసలైన నేరస్తులను శిక్షస్తే తాను సమర్థిస్తానని ఆయన అన్నారు. కడపలో పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన ఇద్దరికి చంద్రబాబు నాయుడు బీఫారమ్ ఇచ్చింది వాస్తవం కాదా అని చెవిరెడ్డి ప్రశ్నించారు. అంతమాత్రాన చంద్రబాబు స్మగ్లర్ అవుతారా అని ఆయన అన్నారు.