redsandal wood
-
రెక్కలు తెగిన రంగుల చిలక..!
- స్వేచ్ఛాప్రపంచం నుంచి జైలుకు - బందీ జీవితంపై విరక్తి - బెయిల్ రాక మనోవేదన - రెడ్‘క్వీన్’ సంగీత ఛటర్జి ఆత్మహత్యకు ప్రయత్నం - ఉలిక్కిపడిన కారాగార వర్గాలు ఇరవై ఏళ్లకే మోడల్‌గా ర్యాంప్‌పై క్యాట్ వాక్. ఒంపు సొంపుల వయ్యారం.. ఆపై విమానంలో విహారం. ఎయిర్‌హోస్టెస్‌గా నవ్వులొలికే ఉద్యోగం. ఒక్కసారిగా జీవితంలో కుదుపు. అదే ఆమె ఊహించని మలుపు. జైలు జీవితం.. చివరకు ఆత్మహత్యాయత్నం. రెండేళ్లుగా నిత్యం వార్తల్లో ఉన్న సంగీత చటర్జీ గురువారం జైల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిపాలయ్యారు. సాక్షి, చిత్తూరు: ఎర్రక్వీన్ సంగీత చటర్జీ జైలు జీవితం అనుభవించలేక గురువారం చిత్తూరు జైల్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. కోల్‌కతాకు చెందిన సంగీత చటర్జీ 20 ఏళ్లకే మోడల్‌గా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఇదే తరుణంలో ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం దొరికింది. ఇక జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనుకుంటుండగా చెన్నైకు చెందిన మార్కొండ లక్ష్మణ్‌తో పరిచయం ఆమె జీవితాన్ని అనుకోని మలుపుతిప్పింది. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం దుంగలను మలేషియా, దుబాయ్, చైనా ప్రాంతాలకు స్మగ్లింగ్ చేసే లక్ష్మణ్‌పై జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో 15 వరకు కేసులున్నాయి. అప్పటికే పెళ్లయిన లక్ష్మణ్ 2013లో సంగీతను రెండో పెళ్లి చేసుకున్నాడు. మరుసటి ఏడాదే ఇతను చిత్తూరు పోలీసులకు చిక్కడంతో పీడీ యాక్టు కింద అరెస్టు చేశారు. భర్త జైల్లో ఉన్న సమయంలో ఎర్రచందనం సామ్రాజ్యాన్ని సంగీత తన చేతుల్లోకి తీసుకుంది. స్మగ్లింగ్‌కు హవాలా రూపంలో డబ్బులు సమకూర్చడం, సరుకును అనుకున్న సమయానికి విదేశాలకు తరలించడంతో కొత్త గుర్తింపు తెచ్చుకుంది. రెండేళ్లు పోలీసుల కన్నుగప్పి సంగీతను పట్టుకోవడానికి రెండేళ్లుగా జిల్లా పోలీసులు పడరాని పాట్లు పడ్డారు. గతేడాది ఎట్టకేలకు సంగీతను కోల్‌కతాలో అరెస్టు చేసినా.. చిత్తూరుకు తీసుకురాలేకపోయారు. ఆమె లాకర్లలో ఉన్న 2.5 కిలోల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదు, రూ.60 లక్షల విలువచేసే ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఆమెను ఈ ఏడాది మార్చి 29న కోల్‌కతాలో అరెస్టు చేసి చిత్తూరుకు తరలించారు. జిల్లాలోని కల్లూరు, యాదమరి, నిండ్ర పోలీస్ స్టేషన్లలో ఆమెపై కేసులుండగా కల్లూరు, యాదమరి కేసుల్లో సంగీతకు బెయిల్ మంజూరైయింది. నిండ్ర కేసులో బెయిల్ రాక ఐదు నెలలుగా చిత్తూరు జిల్లా జైల్లో రిమాండు ఖైదీగా ఉన్నారు. జైలు జీవితం కష్టమే నిత్యం ఏసీలు, పబ్బులు, విమానాల్లో తిరుగుతూ విలాసవంతమైన జీవితం గడిపిన సంగీత ఛటర్జీ ఓ ఖైదీలా జైల్లో గడపలేకపోయారు. చిత్తూరులోని జిల్లా జైల్లో 150 మందికి పైగా ఖైదీలుంటే ఇందులో ఏడుగురే మహిళలున్నారు. వీరికి హిందీ రాదు. తన మనోభావాలను, బాధలను పంచుకోవడం సంగీతకు సాధ్యం కాలేదు. దీనికి తోడు కేసుల్లో బెయిల్ రాక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. మరుగుదొడ్లను శుభ్రపరిచే యాసిడ్‌ను తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. దీనికి తోడు జైల్లో వేధింపులున్నాయని ఓ సారి.. లేదని మరోసారి సంగీత మీడియాకు తెలిపారు. సంగీత పొట్ట మొత్తం శుభ్రం చేశామని ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని చిత్తూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు చెబుతున్నారు. గొంతు, శరీరం లోపల ఉన్న సున్నితమైన భాగాలేవైనా దెబ్బతిన్నాయేమో.. చూడాలంటే లేటెస్ట్ ల్యాప్రోస్కోపిక్ పరీక్ష అవసరమని తిరుపతి రుయాకు రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. జైల్లో ఖైదీలు వారానికి ఓ సారి మరుగుదొడ్లు శుభ్రపరచాలని.. సంగీతకు టాయ్‌లెట్ క్లీనర్ ఇవ్వగా అది తాగడంతో అస్వస్థతకు గురైందని జైలు పర్యవేక్షకులు రాహుల్ తెలిపారు. -
21 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
కర్నూలు: ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎర్రచందనం అక్రమ రవాణాకు బ్రేక్ పడడం లేదు. కర్నూలు జిల్లా చాగలమర్రి మండల పరిధిలో నల్లమల అటవీ ప్రాంతంలో అక్రమంగా నిల్వ ఉంచిన 21 ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు సోమవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. చిన్నవంగలి రేకుల బ్రిడ్జి సమీపంలోని అటవీ ప్రాంతంలో పొదల్లో ఈ దుంగలను నిల్వ ఉంచగా... ఫారెస్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది గాలింపు చర్యల్లో వెలుగు చూశాయి. వీటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని అంచనా. -
47 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
బేస్తవారిపేట : ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం గలిజేరుగుల్లలో పొలంలో దాచి ఉంచిన 47 ఎర్రచందనం దుంగలను శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎర్రచందనం దుంగలను పొలంలో దాచారని సమాచారం అందడంతో పోలీసులు వెంటనే తనిఖీ చేశారు. -
‘ఎర్ర’ స్మగ్లర్లపై ‘టాస్క్‘ఫోర్స్’
ఎర్రచందనం అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట వేసే యత్నం స్మగ్లర్లపై కేసు నమోదు, దర్యాప్తు అధికారాలు కూడా టాస్క్‌ఫోర్స్‌కే వారం రోజుల్లో వెలువడనున్న జీవో అటవీ చట్టం సవరణ.. అవసరమైతే ఆర్డినెన్స్ జారీకి యత్నాలు సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర పోలీసు, అటవీ శాఖలు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు కేసుల నమోదు అధికారాన్ని కూడా ఇవ్వనున్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణా కేసుల్లో ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) జారీ చేసి దర్యాప్తు చేపట్టి, కోర్టులో అభియోగపత్రాలు సైతం దాఖలు చేసే బాధ్యతలు కూడా ఈ టాస్క్‌ఫోర్స్‌కే అప్పజెప్పనున్నారు. ప్రత్యేక విధుల కోసం ఏర్పాటు చేసే టాస్క్‌ఫోర్స్‌కు కేసుల నమోదు అధికారం ఇవ్వడం ఇదే తొలిసారి. హైదరాబాద్, సైబరాబాద్, విజయవాడ, విశాఖపట్నం కమిషనరేట్లలో టాస్క్‌ఫోర్స్‌లు ఉన్నాయి. వీటికి కేసులు నమోదు చేసే అధికారం లేదు. కేవలం అసాంఘిక శక్తులు, నేరగాళ్లపై నిఘావేయడం, వారి కార్యకలాపాలను నిరోధించడం వీటి ప్రధాన విధి. అవసరమైతే దాడులు చేసి నేరస్తులను అదుపులోకి తీసుకోవడం వీటి బాధ్యత. అదుపులోకి తీసుకున్న నిందితులను సంబంధిత పోలీసులకు అప్పజెప్పడంతో వీటి విధులు ముగుస్తాయి. నిందితుపై కేసుల నమోదు, అరెస్టు, దర్యాప్తు, ఇతరత్రా వ్యవహారాలన్నీ పోలీసులే చేపడతారు. దీనివల్ల నేరగాళ్లపై ఆరోపణలు రుజువుకావడంలేదు. దీంతో ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టించడానికి ఏర్పాటు చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌కు అక్రమ రవాణా నిరోధమే కాకుండా, స్మగ్లర్లను పట్టుకోవడం, కేసుల నమోదు, దర్యాప్తు అధికారాలనూ ఇస్తున్నారు. ఆధారాలను సేకరించి, న్యాయస్థానాల్లో అభియోగపత్రాలను సైతం టాస్క్‌ఫోర్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల స్మగ్లర్ల కట్టడితో పాటు వారిపై నేరాల్ని నిరూపించవచ్చని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఈ మేరకు పలు కీలకాంశాలతో కూడిన ప్రతిపాదనల్ని రాష్ట్ర పోలీసు విభాగం ప్రభుత్వానికి పంపింది. దీనిపై సర్కారు వారం రోజుల్లో జీవో జారీ చేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన బిల్లును పోలీసు విభాగం న్యాయ శాఖకు పంపింది. టాస్క్‌ఫోర్స్‌కు కేసుల నమోదు అధికారం ఇవ్వడానికి అటవీ చట్టం సవరణ అంశాన్ని కూడా పోలీసు ఉన్నతాధికారులు న్యాయశాఖకు పంపిన బిల్లులో పొందుపరిచారు. శీతాకాల సమావేశంలో ఇది చట్టంగా మారే అవకాశం ఉంది. ఈ బిల్లు చట్టంగా మారడానికి ఎక్కువ సమయం పట్టే పక్షంలో ఆర్డినెన్స్ జారీ చేయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తిరుపతి కేంద్రంగా ఏర్పాటు చేయనున్న ఈ టాస్క్‌ఫోర్స్‌కు డీఐజీ స్థాయి అధికారి నేతృత్వం వహించనున్నారు. పోలీసు, అటవీ శాఖలకు చెందిన దాదాపు రెండు వేల మంది సిబ్బందిని దీనికి కేటాయించనున్నారు. పెద్ద మొత్తంలో సిబ్బంది ఉండటం వల్ల కేసుల దర్యాప్తు పెద్ద కష్టం కాబోదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
ఇక డీఎస్పీలదే పాలన
చిత్తూరు(అర్బన్): రాష్ట్రంలో ఇటీవల 125 మంది డీఎస్పీలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారితో పాటు పదోన్నతిపై కూడా పలువురు డీఎస్పీలుగా జిల్లాకు రానున్నారు. అయితే సీఐ స్థాయి పోస్టు ఉన్న స్టేషన్లకు డీఎస్పీలను నియమించడంతో ఆ స్థానాల్లో ఇక సీఐ పోస్టులు భర్తీచేసే అవకాశాలు దాదాపు లేనట్లే. మరోవైపు ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తూ, డీఎస్పీలను నియమించడానికి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాకు 14 మంది డీఎస్పీలను కేటాయిస్తూ ఈ నెల 7న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేనివిధంగా డీసీఆర్బి, మహిళా పోలీసు స్టేషన్, స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లకు డీఎస్పీలను నియమించారు. ఇందులో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక నేరాలు, ట్రాఫిక్ నియంత్రణ జిల్లాలో తిరుమల, చిత్తూరు నగరాల్లోని ట్రాఫిక్, సీసీఎస్ పోలీసు స్టేషన్లలో సీఐల స్ధానంలో డీఎస్డీలను నియమించారు. దీంతో నేరాలతో పాటు, ట్రాఫిక్ క్మ్రబద్ధీకరణకు మార్గం సుగుమం అయిందని భావిస్తున్నారు. చిత్తూరు సీఐను ఆపరేషన్ రెడ్‌కు కేటాయించడంతో రాత్రి గస్తీలు కూడా కరువయ్యాయి. ఆ స్థానంలోకి డీఎస్పీ రానుండడంతో పరిస్థితి మెరుగుపడే అవకాశం ఏర్పడింది. చిత్తూరు మహిళా స్టేషన్, తిరుపతి ఎర్రచందనం టాస్క్ఫోర్సుకు డీఎస్పీ పోస్టులు ఇవ్వడంపై అన్ని వర్గాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అయిలే జిల్లాలో నేర పరిశోధన రికార్డు తయారీ (డీసీఆర్బీ), స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) విభాగాలకు కూడా డీఎస్పీలను కేటాయించడంపై పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలావుండగా జిల్లాలో డీఎస్పీల నియామకం, సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతులు ఇచ్చే ప్రక్రియ పూర్తవడంతో అందరి చూపు సీఐలవైపే ఉంది. కోరుకున్న చోటికి పోస్టింగులు తెచ్చుకోవడానికి ఇప్పటికే జిల్లాలోని పలువురు సీఐలు అధికారపార్టీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సీఎం సింగపూర్ పర్యటన తరువాత జిల్లాలో సీఐల బదిలీలు ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తరువాత ఎస్ఐల బదిలీలు చేపట్టనున్నట్లు సమాచారం. -
150 మంది తమిళ స్మగర్లు పరార్
కడప: ఎర్రచందనం అక్రమ రవాణా నివారించడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడంలేదు. తమిళ స్మగ్లర్లు భారీ మొత్తంలో మన రాష్ట్రం నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించుకుపోతున్నారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు సమీపంలోని లంకమల్ల అభయారణ్యంలో ఎర్రచందనం భారీ డంప్‌ను ఈ రోజు ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎర్ర చందనం విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఈ ఎర్రచందనం తరలించేందుకు ప్రయత్నిస్తున్న 150 మంది తమిళ స్మగర్లు ఫారెస్టు అధికారులకు చిక్కకుండా పరారీపోయారు. ** -
'అంతమాత్రాన చంద్రబాబు స్మగ్లర్ అవుతారా?'
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను రాజకీయ ప్రత్యర్థులుగా కాకుండా శత్రువులుగా భావించి టీడీపీ అణగదొక్కాలని చూస్తోందని చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. గంగాధర నెల్లూరుకు చెందిన పార్టీ కార్యకర్త విజయానందరెడ్డిపై రాజకీయ కోణంలోనే స్మగ్లర్ అని కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. రాజమండ్రి జైలులో ఉన్న విజయానందరెడ్డిని పరామర్శించటం తన బాధ్యతగా అనుకున్నానన్నారు. అయితే దీనిపై కొన్ని ఛానల్స్ రకరకాల క్లిప్సింగ్స్ వేస్తూ ఆరోపణలు చేయటం సరికాదన్నారు. తానెప్పుడూ ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించలేదని చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్పష్టం చేశారు. అసలైన నేరస్తులను శిక్షస్తే తాను సమర్థిస్తానని ఆయన అన్నారు. కడపలో పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన ఇద్దరికి చంద్రబాబు నాయుడు బీఫారమ్ ఇచ్చింది వాస్తవం కాదా అని చెవిరెడ్డి ప్రశ్నించారు. అంతమాత్రాన చంద్రబాబు స్మగ్లర్ అవుతారా అని ఆయన అన్నారు. -
'అంతమాత్రాన చంద్రబాబు స్మగ్లర్ అవుతారా?'