బేస్తవారిపేట : ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం గలిజేరుగుల్లలో పొలంలో దాచి ఉంచిన 47 ఎర్రచందనం దుంగలను శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎర్రచందనం దుంగలను పొలంలో దాచారని సమాచారం అందడంతో పోలీసులు వెంటనే తనిఖీ చేశారు.