150 మంది తమిళ స్మగర్లు పరార్
కడప: ఎర్రచందనం అక్రమ రవాణా నివారించడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడంలేదు. తమిళ స్మగ్లర్లు భారీ మొత్తంలో మన రాష్ట్రం నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించుకుపోతున్నారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు సమీపంలోని లంకమల్ల అభయారణ్యంలో ఎర్రచందనం భారీ డంప్ను ఈ రోజు ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఎర్ర చందనం విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఈ ఎర్రచందనం తరలించేందుకు ప్రయత్నిస్తున్న 150 మంది తమిళ స్మగర్లు ఫారెస్టు అధికారులకు చిక్కకుండా పరారీపోయారు.
**