సాక్షి, విజయవాడ : కుయుక్తులు, కుతంత్రాలతో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు టీడీపీ చేస్తున్న కుట్రలు ఫలించవని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు హయాంలోని మాటల ప్రభుత్వానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోని చేతల ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని జనం గమనిస్తున్నారని అన్నారు. శనివారం పార్టీ ఆదేశాలతో ఏడాది ఉత్సవాలని మల్లాది విష్ణు వినూత్నంగా నిర్వహించారు. గుణదల దీపానివాస్‌లోని మానసిక వికలాంగుల మధ్య సంబరాలు చేసుకున్నారు. వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అఖండమెజార్టీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటను సీఎం జగన్ నెరవేర్చుకుంటున్నారని తెలిపారు. అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల హామీలను నిలబెట్టుకుని పొరుగు రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తున్నారన్నారు. అన్నివర్గాల సంక్షేమంతో ప్రజారంజక పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment