బాబు బూటకపు హామీలపై సమర శంఖం | YSRCP to hold Dharnas across AP against Chandra Babu | Sakshi
Sakshi News home page

బాబు బూటకపు హామీలపై సమర శంఖం

Published Thu, Nov 6 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

బాబు బూటకపు హామీలపై సమర శంఖం

బాబు బూటకపు హామీలపై సమర శంఖం

 విజయనగరం కంటోన్మెంట్ : కడుపు మండిన రైతన్నలు కదం తొక్కారు. చంద్రబాబు హామీతో మోసపోయామంటూ డ్వాక్రా మహిళలు కొం గు బిగించారు. తమ కొస్తున్న పింఛన్‌ను నిలిపివేసి అవస్థల పాలు చేశారంటూ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు రోడ్డెక్కారు.  సర్కార్ తీరును కడిగిపారేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మండల కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. రైతు, డ్వాక్రా మహిళల రుణాలను వెంటనే మాఫీ చేయాలంటూ చేపట్టిన ధర్నాలకు జిల్లావ్యాప్తంగా జనం పోటెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను టీడీపీ అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ శ్రేణు లతో కలిసి బాధిత జనం గర్జించారు. మండల రెవెన్యూ కార్యాలయాలను దిగ్బంధించి... కార్యకలాపాలను స్తం భింపచేశారు. ధర్నాలతో మండల కేం ద్రాలు హోరెత్తాయి. నిరసన నినాదాలు మిన్నంటాయి, ర్యాలీలు రాస్తారోకోలతో రహదారులు దిగ్బంధమయ్యాయి. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ సీపీ నేతలు మాట్లాడుతూఈ ఉద్యమాన్ని ఇక్కడితో ఆపేదిలేదని, హామీలు నెరవేర్చేవరకూ  కొనసాగిస్తామని హెచ్చరించారు.
 
  జిల్లా కేంద్రం విజయనగరంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఇంటి వద్ద నుంచి బైక్ ర్యాలీని ప్రారంభించి మండల తహ శీల్దార్ కార్యాలయం వరకూ నినాదాలతో కొనసాగించారు. అనంతరం  పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.  పార్టీ నేతలు అవనాపు విజయ్, కాళ్ల గౌరీ శంకర్, అవనాపు విక్రమ్, గొర్లె వెంకటరమణ, ఎస్వీ రాజేష్, మామిడి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ, ధర్నా ఆద్యంతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రుణమాఫీ చేస్తామని చెప్పి గద్దెనెక్కి గద్దల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించారు. అనంత రం రెవెన్యూ సిబ్బందికి వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
 
 బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో
 బొబ్బిలి పట్టణంలో నిర్వహించిన ధర్నాలో  పారీ ్టరాష్ట్ర  ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్ కృష్ణరంగారావు పాల్గొన్నారు. బొబ్బిలి కోట నుంచి మండల తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.  రైతులు, డ్వాక్రా మహిళలకు  దొంగ రుణహామీలిచ్చిన చంద్ర  బాబుకు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద రెండు గంటల పాటు రహదారిని దిగ్బంధించారు. రుణమాఫీ చేసేంతవరకూ బాధితుల తరఫున  పోరాటం చేస్తామని సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ అర్హులకు అన్యాయం చేస్తే వారినీ విడిచిపెట్టేది లేదన్నారు. ఎన్‌సీఎస్ సుగర్స్‌కు చెరకు సరఫరా చేసిన రైతులకు వెంటనే  బకాయిలు చెల్లించి, ప్రభుత్వమే కంపెనీని నడపాలని డిమాండ్ చేశారు. లేకుంటే  ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.  వేలాది మంది   నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు. అనంతరం తహశీల్దార్ మసిలామణికి వినతిపత్రాన్ని అందించారు. రామభద్రపురం మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో వందలాది మంది ప్రజలు,  పార్టీనాయకులు  పాల్గొన్నారు. ధర్నా అనంతరం హెచ్‌డీటీ జనార్దనరావుకు వినతి పత్రాన్ని ఇచ్చారు.  తెర్లాం మండల కేంద్రంలో ఎస్‌బీఐ నుంచి ర్యాలీగా మండల తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి అక్కడ ధర్నా చేశారు. అనంతరం సీనియర్ అసిస్టెంటు వై సన్యాసినాయుడుకు వినతిపత్రాన్ని ఇచ్చారు. అలాగే బాడంగి మండలం కేంద్రంలో నాయకులు పెద్దింటి రామారావు, పూడి కృష్ణమూర్తి, గుణుపూరు స్వామినాయుడు ఆధ్వర్యంలో ఆంధోళన జరిగింది. అనంతరం రెవెన్యూ సిబ్బందికి వినతిపత్రాన్ని ఇచ్చారు.
 
 సాలూరు నియోజకవర్గంలో
 ఎమ్మెల్యే  రాజన్న దొర ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంత కు ముందు  హైవే జంక్షన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించా రు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ  రైతుల, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని  హామీ లు, మోసం చేశారని ఎమ్మెల్యే రాజన్నదొర ఆరోపించారు. పాచిపెంట, మెంటాడలో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఎంపీపీ ఇజ్జాడ సింహాచలమ్మ, జెడ్పీటీసీ సలాది అనురాధ, పార్టీనేతలు డోల బాబ్జీ, పి.గౌరీశ్వరరావు, శొంఠ్యాన సింహాచలం, రెడ్డి సన్యాసినాయుడు  పాల్గొన్నారు.  
 
 కురుపాం నియోజకవర్గ పరిధిలో
 కురుపాంలో జరిగిన నిరసన ప్రదర్శనలో ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి , జెడ్పీటీసీ సభ్యురాలు శెట్టి పద్మావతి, మండలాధ్యక్షరాలు ఆనిమి ఇందిరాకుమారి తదితరులు పాల్గొన్నారు.  ముందుగా  భారీ ర్యాలీ నిర్వహించారు. బస్‌స్టాండ్‌లో మహిళలతో మానవహారం, అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనలు తెలిపారు.గరుగుబిల్లి మండలంలోని మండల కన్వీనర్‌మ బొబ్బిలి అప్పలనాయుడు, మాజీ ఎం పీపీ ఉరిటి రామారావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.గుమ్మలక్ష్మీపురంలో  ఎమ్మెల్యే పాముల పుష్పవాణి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ సీపీ నాయుకులు దీనయ్య, గిరి తోపాటు పలువురు ఎంపీటీసీల ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జియ్యమ్మవలస మండల కేంద్రంలోని వైఎస్‌ఆర్ సీపీ నాయుకులు  తహశీల్దార్ కార్యాలయంఎదుటధర్నానిర్వహించారు
 
 నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలో...
  నెల్లిమర్లలో మొయిద జంక్షన్ నుంచి తహశీల్దార్ కార్యాలయానికి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు.  కేంద్ర పాలకమం డలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు , చనుమల్లు వెంకటరమణల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో కార్యకర్తలు  నినాదాలతో హోరెత్తించారు.   చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌చేస్తూ తహశీల్దార్ కార్యాలయంలో డీటీ రమాదేవికి వినతిపత్రాన్ని అందించారు. పూసపాటి రేగలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పెనుమత్స  సురేష్‌బాబు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.   భోగాపురంలో కాకర్లపూడి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. డెంకాడలో ఏఎంసీ మాజీ చైర్మన్ అంబళ్ల శ్రీరాములునాయుడు, పూసపాటి రామభద్రరాజుల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో 400 మంది పై చిలుకు కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్నా నిర్వహించి వినతిపత్రాన్ని అందించారు.
 
 గజపతినగరం నియోజకవర్గ పరిధిలో...
   గజపతినగరంలో ఉత్తరావిల్లి అప్పలనాయుడు, రాంజీ రాజు, గిడిజాల కామునాయుడు, మీసాల అప్పలనాయుడు తదతరులు పాల్గొన్న ధర్నాలో తుపాను సహాయక చర్యలను పక్షపాతంగా నిర్వహించారని విమర్శించారు. దత్తిరాజేరులో జెడ్పీటీసీ గొటివాడ అప్పలమ్మ, గుచ్చిమి సర్పంచ్ కడుబండి సింహాచలం, కడుబండి సుధారాణి, తిరుపతి తదితరులు పాల్గొన్న ఈ ధర్నాలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  బొండపల్లిలో ఈదుబిల్లి కృష్ణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గంట్యాడలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం జరిగింది.
 
 చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో....
 చీపురుపల్లిలో విజయనగరం పార్లమెంటరీ సమన్వయకర్త బెల్లాన చంద్రశేఖర్(పెదబాబు)ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. బెల్లాన ఇంటి  నుంచి మూడు రోడ్ల జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించి అక్కడ రాస్తారోకో చేశారు. మెరకముడిదాం, గుర్ల, గరివిడి మండలాల్లోని తహశీల్దార్ కార్యాలయాల ఎదుట భారీ ఎత్తున ధర్నాలు నిర్వహించారు.
 
 ఎస్. కోట నియోజకవర్గ పరిధిలో...
  కొత్త వలసలో భారీ ఎత్తున నిర్వహించిన ధర్నాలో  సమన్వయ కర్త నెక్కల నాయుడు బాబు, ఎం అప్పారావు, రాష్ట్ర మహిళా కమిటీ సభ్యురాలు యల్లపు దమయంతీ దేవి తదితరులు పాల్గొన్నారు. ఎస్‌కోటలో ఎస్ సత్యం, షేక్  రహ్మాన్, మోపాడనాయుడు, కె రంగా, కె వీరన్నలతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎల్‌కోటలో తూర్పా టి కృష్ణస్వామినాయుడు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జామిలో కాకర్లపూడి సూరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ప్రభుత్వ హామీలను వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు.
 
 పార్వతీపురం నియోజకవర్గ పరిధిలో...
 పార్వతీపురంలో భారీ ర్యాలీ నిర్వహించిన నాయకులు తహ శీల్దార్ కార్యాలయానికి చేరుకుని ధర్నా కార్యక్రమం నిర్వహించారు.  వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ జమ్మాన ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ఉదయభాను, మజ్జి వెంకటేష్‌తదితరులు పాల్గొనగా వైఎస్సార్ సీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు  వంగపండు ఉష కార్యకర్తలను ఉత్తేజపరిచే విధంగా విప్లవ గీతాలను ఆలపించారు. సీతానగరంలో ఎంపీపీ, జడ్పీటీసీ లు బొన్నాడ రామలక్ష్మి, తెంటు సావిత్రమ్మల ఆధ్వర్యంలో జరిగిన భారీ ధర్నాలో మహిళలు చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement