రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం లేఖ రాసింది.
హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం లేఖ రాసింది. 4,5 తేదీల్లో జరిగే ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికల సందర్భంగా జనరల్ బాడీ సమావేశం అనంతరం స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నికల ప్రక్రియ నుంచి బయటకు పంపేలా ఆదేశాలు ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ లేఖలో విజ్ఞప్తి చేసింది. మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో ఇప్పటికే పలుచోట్ల కిడ్నాపులు, ప్రలోభాలు జరిగాయని, ఈ నేపధ్యంలోనే ప్రజా ప్రతినిధులు అక్కడే ఉంటే ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన లేఖలో పేర్కొంది.