మొబైల్ ఫోన్ (ఫైల్ ఫోటో)
'కేంబ్రిడ్జ్ అనలిటికా' అనే సంస్థ ఫేస్‌బుక్ యూజర్ల సమాచారాన్ని వినియోగించుకుని ఎన్నికలను 'ప్రభావితం చేసింద'న్న బలమైన ఆరోపణలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వివాదం కేవలం అమెరికా, యూకేలకు మాత్రమే కాక, భారత్‌లోనూ ప్రకంపనాలు చెలరేగుతున్నాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య కూడా కేంబ్రిడ్జ్ అనలిటికాపై తీవ్ర దుమారమే చెలరేగుతోంది. ఈ వివాద నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌తో ఎన్నికల్లో ఎలా గెలువవచ్చో కూడా తెరపైకి వచ్చింది. భారత్‌లో జరిగిన పలు ఎన్నికల్లో కేంబ్రిడ్జ్, ఎస్‌సీఎల్‌కు చెందిన దేశీయ పార్టనర్ ఓవ్లీన్ బిజినెస్ ఇంటెలిజెన్స్(ఓబీఐ) డేటా ఎనాలిటిక్స్ ప్రభావితం చేశాయని తెలిసింది.
2010 ప్రారంభం నుంచి మొబైల్స్‌ను వాడుకుని కొత్త కొత్త పొలిటికల్ టూల్స్‌ను తాము అభివృద్ధి చేశామని ఓబీఐ అధినేత అమ్రిష్ త్యాగి చెప్పారు. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్‌తో ఎలా ఎన్నికల్లో గెలువ వచ్చు అని కొంతమంది రాజకీయ నాయకులు అడిగారని తనకు గుర్తు ఉందని తెలిపారు. మొబైల్ ఫోన్‌తో ఎన్నికల్లో గెలవడం త్యాగి కంపెనీ ఆర్ట్‌కు సంబంధించి కచ్చితమైన వివరణ అని అన్నారు.
మొబైల్ ఫోన్ ప్రజల అభిప్రాయాలను ఎలా రూపుదిద్దగలదో వివరించారు. ఇది ప్రజలను సోషల్ మీడియాతో లింక్ చేయడంతోనే సాధ్యమని త్యాగి చెప్పారు. సోషల్ మీడియా పాత్ర చాలా కీలకమైనదని, ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడే బ్రాండ్ క్రియేట్ చేసుకోవాల్సినవసరం ఉందన్నారు. దీనిలో వ్యక్తిగత బ్రాండు చాలా కీలమన్నారు. స్పీచులు, ఇతర పోస్టర్ల ద్వారా కంటే కూడా మొబైల్ ఫోన్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని చాలా వేగంగా మార్చవచ్చని తెలిపారు. 2015లో బిహార్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఓ సంఘటనను కూడా త్యాగి గుర్తు చేసుకున్నారు. నితీష్ కుమార్‌కు చెందిన ఓ ఫోటోను విడుదల చేశామని, అది సెకన్లలో వైరల్ అయిందని తెలిపారు. ‘బిహార్ ఎన్నికల్లో మా క్లైంట్ అఖండ విజయం సాధించారు. మేం టార్గెట్ చేసిన సీట్లలో 90 శాతం సీట్లను గెలుచుకున్నాం’ అని కేంబ్రిడ్జి అనలిటికా ప్రకటించుకుంది కూడా.
ఫేస్‌బుక్ ఖాతాదారుల సమాచారాన్ని ‘ప్రిడిక్టివ్ అనలటిక్స్, బిహేవియరల్ సైన్స్’తో విశ్లేషించి కేంబ్రిడ్జ్ అనలిటికా ఖాతాదారుల మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటుంది. అంటే, ఫేస్‌బుక్ ఖాతాదారుల్లో ఏ ఓటరు ఏ రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు? ఎందుకు చూపుతున్నారు? ఏ పార్టీకి ఓటు వేయాలన్న విషయంలో ఎవరు ఇంకా సందిగ్ధంలో ఉన్నారు? అన్న అంశాలను పసిగట్టి వారిని లక్ష్యంగా చేసుకొని సీఏ లాంటి సంస్థలు తమ క్లైంట్‌కు సానుకూలంగా ఓటరు మలుచుకుంటాయి. 2016లో త్యాగి అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ను గెలిపించేందుకు సాయపడినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment