
సాక్షి, ముంబై: టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ చైనా స్మార్ట్‌ఫోన్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. శాంసంగ్, సెల్‌కాన్, ఇంటెక్స్ భాగస్వామ్యంతో ఇటీవల మొబైల్స్ పై క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించిని ఎయిర్‌టెల్ తాజాగా ఐటెల్‌తో టై అప్ కుదుర్చుకుంది. 'మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్' పథకం కింద చైనా ట్రాన్స్నిషన్ గ్రూప్ యాజమాన్యంలోని ఐ టెల్ మొబైల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు శుక్రవారం ప్రకటించింది. తాజా డీల్ ప్రకారం ఐటెల్ ఎ40, ఎ41 మొబైల్స్‌పై ఈ ఆఫర్ అందిస్తోది.
ఈ రెండు మొబైల్స్ కొనుగోళ్లపై రూ.1500 క్యాష ఆఫర్. దీంతో ఎ 40, ఎ 41 ధరలు వరుసగా రూ. 3,099 (అసలు ధర 4,599) రూ. 3,199గా (అసలు ధర 4,699ఉండనున్నాయి. అయితే మొత్తం రూ.3వేలు ఎయిర్ టెల్ రీచార్జ్ చేసుకోవాలి. అనంతరం 18 నెలల రీచార్జ్ తర్వాత మొదటి దఫా రూ.500, తదుపరి 18 నెలల్లో మరో రూ.3వేలు రీచార్జ్ తరువాత రూ.1000లు అందిస్తుంది.
ఐటెల్ తో భాగస్వామ్యంపై సంతోషంగా ఉన్నామని భారతి ఎయిర్‌టెల్ సీఓఓ అజయ్ పూరి తెలిపారు.
ఎ40 ఫీచర్లు
5 అంగుళాల FWVGA
480x854 పిక్సెల్స్ డిస్ప్లే
1.3 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ నౌగట్ 7.0
1జీజీ ర్యామ్
8జీబీ స్టోరేజ్
32జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
5 మెగాపిక్సెల్ రేర్ కెమెరా
2400 ఎంఏహెచ్ బ్యాటరీ
ఎ40, ఎ 41