
మొండి బకాయిల పరిష్కారానికి చికిత్స అవసరం: రాజన్
ముంబై:బ్యాంకింగ్ మొండిబకాయిల పరిష్కారానికి తగిన ఫలితాలను అం దించే సమర్థవంతమైన శస్త్ర చికిత్స అవసరమని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ గురువారం పేర్కొన్నారు. మొండి బకాయిల సమస్య పరిష్కారమయితే అది బ్యాంకుల భవిష్యత్ పటిష్ట వృద్ధి రేటుకు సైతం దోహదపడుతుందని అన్నారు. ఇకపై రుణ నాణ్యతా సమీక్ష (ఏక్యూఆర్)లు ఏవీ ఉండబోవని కూడా సీఐఐ ఇక్కడ నిర్వహించిన ఒక బ్యాంకర్ల సదస్సులో ఆయన అన్నారు. కాగా మొండిబకాయిల సమస్యకు నిర్వహణా పరమైన లోపాలే కారణమని డిప్యూటీ గవర్నర్ ముంద్రా పేర్కొన్నారు.