61శాతం పడిన ఫైనాన్షియల్ టెక్ లాభం
న్యూఢిల్లీ: జిగ్నేష్ షా నేతృత్వంలోని ఫైనాన్షియల్ టెక్నాలజీస్ (ఇం డియా) నికర లాభం రెండవ త్రైమాసికంలో 61 శాతంపైగా పడింది. స్టాండెలోన్ ప్రాతిపదికన సంస్థ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే రూ.70 కోట్ల నుంచి రూ.27 కోట్లకు పడిపోయింది.
సంక్షోభంలో కూరుకుపోయిన అనుబంధ సంస్థ నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈఎల్)కి కేటాయింపులు జరపాల్సి రావడం దీనికి ప్రధాన కారణం. ఇక నిర్వహణపరమైన ఆదాయం సైతం రూ.125 కోట్ల నుంచి రూ.93 కోట్లకు పడిపోయింది. సాఫ్ట్‌వేర్ బిజినెస్‌పరంగా రెవెన్యూ తగ్గడం దీనికి కారణమని కంపెనీ తెలిపింది. వ్యయాలు రూ.55 కోట్ల నుంచి రూ. 68 కోట్లకు ఎగశాయి. కాగా షేర్‌కు రూ. 2 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. డిసెంబర్ 20న ఈ చెల్లింపులు ఉంటాయి.