మార్కెట్ లోకి 26 వేల కోట్ల విదేశీ నిధులు!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం సంస్కరణలకు మొగ్గు చూపుతుందనే సానుకూల వార్తలతో విదేశీ ఇన్వెస్టర్లు జూన్ నెలలో ఇప్పటి వరకు 26 వేల కోట్ల రూపాయలను భారత స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టారు.
అందుబాటులోకి వచ్చిన గణాంకాల ప్రకారం 10359 కోట్ల రూపాయలను ఈక్వీటి మార్కెట్ లో సెక్యూరిటీ డిపాజిట్ల, నికర రూపంలో పెట్టుబడులను పెట్టినట్టు తెలుస్తోంది. అలాగే డెబిట్ మార్కెట్ లో 15806 కోట్లు రూపాయలను పెట్టుబడి పెట్టారు.
సంస్కరణలను మోడీ ప్రభుత్వం కొనసాగిస్తుందనే సానుకూల అంశంతో విదేశీ పెట్టుబడుదారులు మార్కెట్ లోకి నిధులను ప్రవహింప చేస్తున్నారని మార్కెట్ నిపుణులు వెల్లడించారు. విదేశీ నిధుల ప్రవాహంతో జూన్ నెలలో సెన్సెక్స్, ఇతర ప్రధాన సూచీలు 4 శాతం మేరకు లాభపడిన సంగతి తెలిసిందే.