
ఫారెక్స్ నిల్వలు డౌన్
367 బిలియన్ డాలర్లకి పరిమితం
ముంబై: దేశీ విదేశీ మారక నిల్వలు నవంబర్ 11తో ముగిసిన వారంలో 1.19 బిలియన్ డాలర్ల క్షీణతతో 367.04 బిలియన్ డాలర్లకు పడ్డాయి. విదేశీ కరెన్సీ అసెట్స్‌లో తగ్గుదలే ఫారెక్స్ నిల్వల క్షీణతకు కారణమని రిజర్వు బ్యాంక్ పేర్కొంది. విదేశీ కరెన్సీ అసెట్స్ 1.15 బిలియన్ డాలర్ల క్షీణతతో 342.77 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇక బంగారు నిల్వలు స్థిరంగా 20.46 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా కడుపటి వారంలో ఫారెక్స్ నిల్వలు 368.23 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సెప్టెంబర్ 30తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు ఆల్‌టైం గరిష్టానికి (371.99 బిలియన్ డాలర్లకు) ఎగసిన విషయం తెలిసిందే.