ప్రోత్సాహకాలు, మినహాయింపులకు ఇక చెల్లు
భారత్ పరిశ్రమకు ఆర్థికమంత్రి స్పష్టీకరణ
న్యూఢిల్లీ: భారత పరిశ్రమకు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కీలక సూచనలు చేశారు. ప్రోత్సాహకాలు, మినహాయింపులకు కాలం తీరిపోతోందని పేర్కొన్న ఆయన వ్యాపార నమూనాల్ని పటిష్టతను మెరుగుపరచుకోవాలని, తద్వారా పోటీ తత్వాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఆర్థికమంత్రి బుధవారం నాడు ఇక్కడ ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా టూరిజం ఇన్వెస్టర్స్ 2016 సదస్సు’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాపార విధానాల్లో సమర్థవంతమైన మార్పుల ద్వారా అందివస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని పరిశ్రమకు సూచించారు.