
న్యూఢిల్లీ: ప్రీమియం సెడాన్ విభాగంలో మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) సియాజ్ టాప్ గేర్‌లో దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి అర్ధభాగంలో 24,000 కార్ల విక్రయం నమోదైనట్లు కంపెనీ ప్రకటించింది. ఈ క్యాటగిరీలో 28.8 శాతం మార్కెట్ వాటాను కలిగిఉన్నట్లు సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.ఎస్. కల్సీ వెల్లడించారు.
2014లో విడుదలైన సెడాన్.. ఇప్పటివరకు 2.34 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. ఆగస్టులో విడుదలైన వెర్షన్ బుకింగ్స్ 10,000గా ఉన్నట్లు వ్యాఖ్యానించారు.