
మ్యూచువల్ ఫండ్స్-ఏ సర్వీస్
స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన సమయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన సమయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్‌పై అవగాహన ఉన్నవారి గురించి ఇక్కడ ఏ సమస్యా లేదు. వారు ప్రత్యక్షంగా వారి డీమ్యాట్ అకౌంట్ల ద్వారా స్టాక్స్‌ను కొనుగోలు చేస్తారు. కానీ మార్కెట్ గురించి అవగాహన లేని వారి విషయానికి వస్తే.. ఎలా? అంటే వీరు మ్యూచువల్ ఫండ్‌స ద్వారా మార్కెట్‌లోకి అడుగుపెట్టాలి. మ్యూచువల్ ఫండ్‌సలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వారి కోసం ఐఐఎఫ్‌ఎల్ ‘మ్యూచువల్ ఫండ్‌స- ఏ సర్వీస్’ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫైనాన్షియల్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రత్యేకతలు
• మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్లను ట్రాక్ చేయవచ్చు.
• ఫండ్ స్కీమ్‌కు చెందిన ఎన్‌ఏవీ, ఏయూఎం వివరాలను పొందొచ్చు. అలాగే ఫండ్ స్కీమ్‌కు సంబంధించిన అసెట్స్ కేటారుుంపులు, రాబడి, పనితీరు, రేటింగ్, రిస్క్ వంటి తదితర అంశాలను తెలుసుకోవచ్చు.
• ఈ యాప్ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు చెందిన వార్తలను ఎప్పటికప్పుడు మనకు తెలియజేస్తుంది. అలాగే దీని ద్వారా ఆయా ఫండ్ మేనేజర్లపై పరిశ్రమ నిపుణులు ఇచ్చే సమీక్షలను చదవొచ్చు.
• ‘మ్యూచువల్ ఫండ్‌స-ఏ సర్వీస్’ యాప్ ఈక్విటీ, హైబ్రిడ్, డెబ్ట్ ఫండ్‌సలో ఏ ఏ ఫండ్‌స మంచి పనితీరు కనబరుస్తున్నాయో చూపిస్తుంది. కావాలనుకుంటే వీటిని కొనొచ్చు. సిప్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.