
వేతనంలో వెనకబడ్డ రాజన్!
న్యూఢిల్లీ: రఘురామ్ రాజన్.. పేరుకు తగ్గట్టే రాజులా ఆర్‌బీఐ లో అత్యంత శక్తివంతమైన వ్యక్తి కావొచ్చు. కానీ ఆయన మాత్రం అందరికన్నా ఎక్కువ వేతనం తీసుకోవడం లేదు. ఆర్‌టీఐ చట్టం కింద ఆర్‌బీఐ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఆర్‌బీఐ గవర్నర్ రాజన్ నెలవారీ వేతనం కింద రూ.1,98,700 (బేసిక్-రూ.90,000, డీఏ-రూ.1,01,700, ఇతర అలవెన్సులు-రూ.7000) తీసుకుంటున్నారు. ఆర్ బీఐ అధికారులైన గోపాలకృష్ణ సీతారామ్ హెగ్దే(రూ.4 లక్షలు), అన్నామలై అరపులి గౌండర్(రూ.2,20,355), వి కందసామి(రూ.2.1 లక్షలు)లు రాజన్ కన్నా ఎక్కువగా నెలవారీ వేతనం తీసుకుంటున్నారు.